Home » వెంకీ, రవితేజ మల్టీ స్టారర్… డైరెక్టర్ ఎవరంటే..?

వెంకీ, రవితేజ మల్టీ స్టారర్… డైరెక్టర్ ఎవరంటే..?

by Azhar
Ad

ప్రస్తుతం మన తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో ఈ మల్టీ స్టారర్ అనేది ఎప్పటి నుండో ఉన్న మధ్యలో కొంతకాలం మాత్రం ఇలాంటి సినిమాలు రాలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ తరహా సినిమాలు మొదలైన తర్వాత దీనిని ముందుకు తీసుకెళ్లింది మాత్రం విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. వెంకీ సోలో హీరోగా సినిమాలు చేస్తూనే యువ హీరోలతో ఎక్కువగా మల్టి స్టారర్ సినిమాలు చేస్తున్నారు.

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన వెంకీ ఆ తర్వాత నాగ చైతన్యతో వెంకీ మామ.. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో కనిపించరు. ఇక ఇపుడు మరో మల్టీ స్టారర్ లో కనిపించబోతున్నాడు వెంకీ అని తెలుస్తుంది. అవును ఇప్పుడు కొత్తగా మాస మహారాజ రవితేజతో కలిసి ఓ సినిమాలో కనిపించబోతున్నాడట వెంకటేష్. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

వెంకటేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో పాటుగా ఈ మధ్యే నారప్ప సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఓ కొత్త మల్టీ స్టారర్ కథను వెంకీకి వినిపించగా.. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు ఈ కథను రవితేజ దగ్గరకు ఆయన తీసుకెళ్లనట్లు సమాచారం. కానీ ఇంకా దీని పై మాస మహారాజ ఏం చెప్పనట్లు తెలుస్తుంది. ఒకవేళ రవితేజ కూడా ఈ సినిమాకు ఓకే చెబితే.. వెంకీ, రవితేజ మల్టీ స్టారర్ సినిమా త్వరాలోనే సెట్స్ పైకి వెళ్తుంది. చూడాలి మరి దీని రవిజేత ఓకే చెబుతాడా లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నరకం చూస్తున్న ఆటగాళ్లు..!

Visitors Are Also Reading