సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాను మిగతా భాషల్లో రీమెక్ చేయడం చేస్తుంటారు. అలా ఒక భాషలో వచ్చిన సినిమాలను మరో భాషలోకి అనువదించి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన రీమెక్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇలా రీమెక్ సినిమాల ట్రెండ్ కొనసాగడం ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లోకి రీమెక్ చేయడం.. ఇతర భాషల సినిమాలను తెలుగులో రీమెక్ చేస్తుంటారు.
ఇలా రీమెక్ చేసిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమా ఒకటి. ఈ చిత్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయంతో సూర్యవంశం సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఈ సినిమా ఓ ట్రెండ్ సృష్టించింది. సూర్యవంశం సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు వెంకటేష్‌ను ఎంతో దగ్గర చేసింది. ఒకవైపు తండ్రి, మరొక వైపు కొడుకు పాత్రలో అందరికీ ఆదర్శంగా నిలిచేవిధంగా వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఊరి నుంచి వెంకటేష్‌ను వెళ్లగొట్టడం.. ఎలాంటి చదువు లేకున్నా భార్య ప్రోత్సాహంతో బిగ్ బిజినెస్ మెన్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. కుటుంబ కథా చిత్రాలను పండించడంలో వెంకటేష్‌కి ఎవరూ సాటిలేరు అనే చెప్పాలి.
Advertisement
Advertisement
అయితే సూర్యవంశం సినిమా తమిళ రీమెక్. తొలుత తమిళంలో ఈ సినిమాకు సూర్యవంశం అని టైటిల్ పెట్టారు. అయితే నిర్మాత ఆర్.బీ.చౌదరి తమిళంలో పూవేఉనక్క అనే చిత్రాన్ని తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత తాను తీయబోయే మరో సినిమాకు విక్రమన్ ని దర్శకత్వం చేయాలని కోరారు. అనేక వాదనల తరువాత చివరికీ విక్రమన్ రాసిన సూర్యవంశం కథను అసంతృప్తితో ఆర్.బీ.చౌదరి అంగీకరించారు. 1997 జూన్ 27న విడుదల అయింది. ఎస్.ఏ.రాజ్‌కుమార్ అందించిన పాటలు తమిళనాట ప్రేక్షకాదరణ పొందాయి. సినిమా బాగుండడంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్ నటకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది.
తెలుగులో ఆర్.బీ.చౌదరి నిర్మాతగా బీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమా ఫిబ్రవరి 25, 1998లో విడుదల అయింది. ఇక ఇదే చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ బ్యానర్, ఆదిశేషగిరిరావు నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో హిందీ చిత్రం1999 మే 21న విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్ ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఆయన పక్కన జయసుధ, సౌందర్య జోడిగా నటించారు. అనుమాలిక్ సంగీతం అందిచారు. కుతుబ్ షాహీ టూంబ్స్, రాజస్థాన్, శ్రీలంక ఈ మూడు లొకేషన్‌లలోనే ఈ సినిమా షూటింగ్ చేశారు. అమితాబచ్చన్ తో పలు చిత్రాల్లో నటించిన రేఖ ఈ సినిమాలో కనిపించినప్పటికీ జయసుధ, సౌందర్యలకి వాయిస్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా కూడా తమిళ, తెలుగు సినిమా మాదిరిగానే సూపర్ హిట్ సాధించింది. తమిళంలో శరత్‌కుమార్, హిందీలో అమితాబచ్చన్ కి ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నారు. కానీ తెలుగులో నటించిన విక్టరీ వెంకటేష్ కి మాత్రం ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడం గమనార్హం.
Also Read :
కృష్ణ తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోను అంటూ ANR ఎందుకు అన్నారు ?
Pakka commercial movie review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!