Home » Pakka commercial movie review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!

Pakka commercial movie review: పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

నటీనటులు : గోపీచంద్, రాశి ఖన్నా, సప్తగిరి, రావు రమేష్, శరత్ కుమార్, తదితరులు
నిర్మాత: బన్నీ వాసు
డైరెక్టర్: మారుతి
సినిమాటోగ్రఫీ : కర్ముచావ్లా
మ్యూజిక్ డైరెక్టర్: జోక్స్ బీజోమ్
రిలీజ్ తేదీ: జూలై1,2022

Advertisement

గత కొద్ది రోజుల నుంచి అనేక ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొని భారీ అంచనాల నడుమ పక్కా కమర్షియల్ మూవీ జులై 1 న రిలీజ్ చేసారు. ఈ మూవీ మారుతి డైరెక్షన్ లో రూపొందింది. హీరో గోపీచంద్,హీరోయిన్ రాశి కన్నా నటించారు. అంతేకాకుండా సప్తగిరి, సత్యరాజ్,శరత్ కుమార్, రావు రమేష్ లాంటి సీనియర్ నటులు కూడా మంచి పాత్రలో ఉన్నారు. బన్నీ వాసు నిర్మాతగా, జోక్స్ బీజోమ్ సంగీతంతో అదరగొట్టారు. సినిమాటోగ్రాఫర్ గా కర్ముచావ్లా, ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ మరియు టీజర్ తో అభిమానులను ఎంతో ఆకట్టుకోగా, సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారని చెప్పవచ్చు. మరి మూవీ గోపీచంద్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో ఓ సారి చూద్దాం.

కథ :
పక్కా కమర్షియల్ మూవీ లో గోపీచంద్ సరికొత్త లుక్ లో కనిపించాడు. గోపీచంద్ రాంచంద్ అనే పాత్రలో లాయర్ గా కనిపించాడు. హీరో ప్రతి ఒక్క విషయంలో పక్కా కమర్షియల్ గా ఉండడంతో చాలా రోజుల తర్వాత ఉద్యోగంలో చేరతాడు. (రాశికన్నా) ఝాన్సీ పాత్రలో చేస్తుంది. అందులో ఆమె సీరియల్ నటి. సీరియల్ లో లాయర్ పాత్ర కొరకు రాంచంద్ దగ్గర అసిస్టెంట్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. హీరో రాంచంద్ ఏమో ఒక కేసు విషయమై తండ్రితోనే వాదిస్తాడు. ఆ కేసులో గెలుస్తాడా లేదా..? తన లవ్ లో సక్సెస్ అయి రాశిఖన్నాను పెళ్లి చేసుకుంటాడా అనేది మీరు కూడా సినిమా చూసి తెలుసుకోండి..?

Advertisement

 

ప్లస్ పాయింట్స్ : ఇందులో గోపీచంద్ యాక్షన్ చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది. అలాగే టైమింగ్ కు తగ్గట్టు కామెడీ ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది.

మైనస్ పాయింట్స్ : ఇందులో కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, సంగీతం అంతగా కనెక్ట్ కాకపోవడం, సెకండాఫ్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.


సాంకేతిక విభాగం: ఈ సినిమా మారుతి కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలవడం ఖాయం. అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ అయితే చాలా అద్భుతంగా ఉంది. పాటలు అంతగా ఆకట్టుకోలేక పోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.

చివరి మాట: సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా.. కామెడీ మాత్రం ప్రతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
రేటింగ్ :3.5/5

Also read: పవన్ కళ్యాణ్ భారీ రెమ్యునరేషన్.. 20 రోజులకు ఎన్ని కోట్లంటే..?

ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ : ఆటగాళ్ల తలపై కెమెరా..!

Visitors Are Also Reading