Home » ఆ మూవీ షూటింగ్ అప్పుడు.. చావు అంచులు దాకా వెంకటేష్.. అసలు ఏమైందంటే..?

ఆ మూవీ షూటింగ్ అప్పుడు.. చావు అంచులు దాకా వెంకటేష్.. అసలు ఏమైందంటే..?

by Sravya
Ad

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ఆరు పదలు వయసులో కూడా సక్సెస్ఫుల్ గా హీరోగా కొనసాగుతున్నారు. కామెడీ, యాక్షన్ ఇలా ఏ జానర్ లో సినిమాలైనా కూడా వెంకటేష్ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి విక్టరీ వెంకటేష్ ఓ సినిమా షూటింగ్ టైంలో చావు అంచుల వరకు వెళ్లారట. చాలామందికి ఈ విషయం తెలీదు. వెంకటేష్ దివ్యభారతి కాంబినేషన్లో బొబ్బిలి రాజా సినిమా వచ్చింది. బి గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బొబ్బిలి రాజా సినిమా షూటింగ్ ఎక్కువగా అడవిలో జరిగింది.

Advertisement

Advertisement

ఆ టైంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమా షూటింగ్ని పూర్తి చేశారు. సినిమా షూటింగ్ నుండి ప్యాకప్ అయ్యాక ఓ చెట్టు కింద కుర్చీ వేసుకుని వెంకటేష్ నిద్రపోయారు. ఆ సమయంలో మొహం మీద ఒక విషపురుగు చెట్టు మీద నుండి పడిందట. వెంకటేష్ నిద్రపోయి ఉండడంతో ఆ విషయమే తెలియలేదు. అది చూసి బి గోపాల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పురుగుని కొట్టేశారు. ఆ తర్వాత తెలిసింది అది విషపురుగు అని. ఒకవేళ కనుక అది కుట్టి ఉంటే వెంకటేష్ ప్రాణాపాయంలో చిక్కుకుని ఉండేవారు. ఇలా ఆ రోజు వెంకటేష్ ఇంత పెద్ద సమస్య నుండి బయటపడ్డారు.

Also read:

Visitors Are Also Reading