Home » Veera Simhareddy: వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక అక్కడేనా..?

Veera Simhareddy: వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక అక్కడేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యూఎస్ సహా పలు ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సంక్రాంతికి ప్రేక్షకులకు కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల ఆరవ తేదీన ఒంగోలులోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 6 గంటల సమయంలో చిత్ర యూనిట్ మరియు అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు ఒక వార్త బయటకు వచ్చింది.

Advertisement

also read:ఈ లక్షణాలున్న పురుషులనే.. మహిళలు చాలా ఇష్టపడతారు..2వది చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

దీంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా ఆరవ తేదీన ఒంగోలు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీర సింహారెడ్డి సినిమాను పల్నాడు బ్యాక్డ్రాప్ తెరకెక్కించారు. అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహిస్తున్నారు నిర్మాతలు. అయితే శ్రేయాస్ మీడియా సంస్థ ఈ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు చేరుకునే ప్రతి మార్గంలో హోర్డింగ్లతో హోరెత్తిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..

అయితే వీర సింహారెడ్డి చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. అంతేకాకుండా బాలకృష్ణ ప్రతి వారం అన్ స్టాపబుల్ షో ద్వారా ఆడియన్స్ తో కనెక్ట్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్,వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా తమన్ మ్యూజిక్ చిత్రానికి మరింత ప్లస్ గా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఇప్పుడికే సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, అజిత్ తెగింపు, విజయ్ వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. మరి చూడాలి ఈ సంక్రాంతి బరిలో ఎవరు విజయం సాధిస్తారో..

also read:

Visitors Are Also Reading