Home » వాస్తు: ఈ జీవులు ఇంటికి వస్తే.. శుభం కలుగుతుంది… అదృష్టం కూడా..!

వాస్తు: ఈ జీవులు ఇంటికి వస్తే.. శుభం కలుగుతుంది… అదృష్టం కూడా..!

by Sravya

వాస్తు ప్రకారం చాలా మంది పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇంట్లోకి ఈ జీవులు వస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ఇంటికి శుభం కలుగుతుంది. నల్ల చీమలు ఇంట్లోకి వస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. శని దేవుడికి సంబంధించినగా నల్ల చీమల్ని భావిస్తారు నల్ల చీమలు మీ ఇంటికి వచ్చినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు మీ ఇంటికి వస్తుంది.

ఇంట్లోకి తాబేలు వస్తే కూడా అది శుభ సూచికం. పాజిటివ్ ఎనర్జీ తాబేలు తీసుకువస్తుంది తాబేలు విష్ణువు యొక్క అవతారం. లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది శాంతిని కలిగిస్తుంది. ఇంటికి చిలుక వస్తే కూడా శుభ సూచకంగా భావించాలి. సంపదకి దేవుడైన కుబేరునికి సంబంధించినది చిలుక. చిలుక ఇంటికి వస్తే ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి సంపద కూడా పెరుగుతుంది. కప్ప ఇంట్లోకి వస్తే కూడా అదృష్టానికి చిహ్నం ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంట్లోకి రెండు తలల పాము వస్తే కూడా ధన ప్రవాహం పెరుగుతుంది విజయం ఐశ్వర్యం సంతోషం ఇవన్నీ కూడా కలుగుతాయి.

Also read:

Visitors Are Also Reading