Home » ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తను నటించిన మొదటిసినిమా కాస్త డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా అనంతరం శ్రీలీలకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల.

sreeleela child photos

sreeleela child photos

తన అద్భుతమైన నటన, డ్యాన్స్, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే దాదాపు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించె అవకాశాన్ని అందుకుంటుంది. తన చేతిలో ఇప్పటికీ దాదాపు పది సినిమాల వరకు ఉన్నాయి. ఇక శ్రీలీల సినిమాలతో పాటు తన చదువుపై కూడా మంచి పట్టును సాధించింది. శ్రీలీల అమెరికాలో భారతీయ కుటుంబంలో జన్మించింది. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా అనంతరం తన తల్లితో కలిసి బెంగుళూరు వచ్చింది. శ్రీలీలకు చిన్న వయసు నుంచి డ్యాన్స్ పై విపరీతమైన పిచ్చి ఉండేది.

Advertisement

Advertisement

అతి చిన్న వయసులోనే భరతనాట్యం డాన్స్ నేర్చుకుంది. తన చిన్నప్పటి భరతనాట్యం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి చాలామంది గుర్తుపట్టనప్పటికీ కొంతమంది మాత్రం చాలా ఈజీగా తన నవ్వును చూసి గుర్తుపట్టారు. ఈ ఫోటోలో ఉన్నది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల అని కామెంట్లు పెడుతున్నారు. అతి చిన్న వయసులోనే శ్రీలీల ఎంతో అందంగా ఉంది. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు శ్రీలీల చాలా క్యూట్ గా ఉంది అని అంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading