Home » సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా

సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా

by Anji
Ad

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే..  తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ స‌భ్యులు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ వ‌స్తుండ‌గా.. పాకిస్తాన్‌లో ఉన్న టెర్ర‌రిస్ట్‌ల‌ను అంతమొందించడానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసే మిష‌నే ఆపరేషన్‌ వాలెంటైన్‌ అని తెలుస్తోంది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.ఇక ఈ చిత్రంలో మిర్‌ సర్వార్‌, నవదీప్‌ ముఖ్య పాత్రలు పోషించారు .ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Visitors Are Also Reading