Home » అల్లు అర్జున్ కి అవార్డుకి రావాలని కోరుకున్న.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్..!

అల్లు అర్జున్ కి అవార్డుకి రావాలని కోరుకున్న.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్..!

by Anji
Ad

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు. ఇక ఈ సభలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కూడా పవన్ మాట్లాడాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ బావుండాలి అని కోరుకున్నవాడిలో తాను ఒకడిని అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావాలని తాను కూడా కోరుకున్నట్లు తెలిపాడు.

Advertisement

Advertisement

ఒక సినిమా హిట్ అయితే.. అది నాదైతే.. ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. బాహుబలి ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. రామ్ చరణ్.. విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. అల్లు అర్జున్, పుష్ప హీరో.. అద్భుతంగా ఉండాలని, గొప్ప అవార్డు రావాలని కోరుకునేవాడిని.. ఇలాంటివారు ఎందరో.. వారందరి గురించి పేరుపేరునా చెప్పలేను కానీ, అందరూ బావుండాలని కోరుకునేవాడిని” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా జనసేనాని నోట.. పుష్ప మాట రావడంతో ఆలు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  పాన్ ఇండియా సిరీస్ గా పీ.వీ. నరసింహారావు బయోఫిక్..!

Visitors Are Also Reading