తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలుంటాయి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో వరుణ్ తేజ్. ఆరడుగుల బుల్లెట్టు లాగా అమ్మాయిల మనసుదోచే అందగాడు ఈ మెగా హీరో. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ఈ అమ్మడు మనసు దోచేశాడు.. త్వరలో ఆమెకు జీవితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు.. మరి వీరిద్దరి మధ్య లవ్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనే విషయాలు చూద్దాం.. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వారు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు.
Advertisement
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ ఊహ, నాగార్జున అమల, జీవిత రాజశేఖర్ , త్వరలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు. కానీ వీరి మధ్య లవ్ పుట్టడానికి ఆ ఒక్క దర్శకుడి కారణమట. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే.. ది గ్రేట్ డైరెక్టర్ శ్రీనువైట్ల.. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు 2017 లో శ్రీను వైట్ల డైరెక్షన్లో మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఈ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. ఇక అప్పటినుంచి వీళ్లు సైలెంట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వస్తున్నారు.
Advertisement
ఈ మధ్యకాలంలోనే మీడియా కంటపడడంతో వీరి ప్రేమ గురించి బయటకు వచ్చింది. దీంతో ఇరు కుటుంబాలకు తెలిసి వీరికి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. తర్వాత త్వరలోనే పెళ్లి కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం శ్రీనువైట్ల అంటూ అనేక మీమ్స్ వస్తున్నాయి.
మరి కొన్ని ముఖ్య వార్తలు:
- దశాబ్ది ఉత్సవాలపై రామ్ చరణ్ అలా అన్నారా..ట్విట్ వైరల్..!!
- నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసా… సమంత… అదిరిపోయే రిప్లై ఇచ్చిన విజయ్..!
- మా అమ్మ అలాంటి పని చేయమంటుంది..కన్నీరు పెట్టిస్తున్న 16ఏళ్ల బాలిక..!