Home » మా అమ్మ అలాంటి పని చేయమంటుంది..కన్నీరు పెట్టిస్తున్న 16ఏళ్ల బాలిక..!

మా అమ్మ అలాంటి పని చేయమంటుంది..కన్నీరు పెట్టిస్తున్న 16ఏళ్ల బాలిక..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం కాలం మారిపోయింది. తల్లి కూతురు, అన్నా చెల్లి, అమ్మ కొడుకు అనే వరుసలు కూడా మసకబారి పోయే పరిస్థితులు దాపరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోయి ప్రాచ్యాత్య సంస్కృతికి అలవాటు పడి చాలామంది మారుతున్నారు. స్టైల్ మార్చుకోవడం మంచిదే కానీ మనకి మనమే మోసం చేసుకునే అంత స్టైల్ మార్చడం మరి దారుణం. ఇక్కడ ఒక తల్లి తన కూతురిని వ్య*చార రొంపిలోకి దింపి, ఆ పని రోజు చేయాలని, అడ్డు చెప్పినందుకు ఆ అమ్మాయిని కొడుతుందట.

Advertisement

అంతేకాకుండా ఆ 16 సంవత్సరాల అమ్మాయికి బాడీ షేప్ పెరగడానికి చాలా రకాల టాబ్లెట్లు కూడా వేసిందని ఆ అమ్మాయి రక్షించాలని కోరుతూ విజయనగర పోలీసులను కూడా ఆశ్రయించిందట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సంచలన విషయాలు బయట పెట్టారు.. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని ఒక ప్రాంతంలో మహిళ నివాసం ఉంటుంది. ఆమె చాలా ఏళ్ల కిందట ఒక చిన్న పిల్లను దత్తత తీసుకొని పెంచింది. ఇప్పుడా బాలికకు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఈమధ్య పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయింది.

Advertisement

అయితే ప్రస్తుతం అమ్మాయికి తెలియకుండా ఆమెకు బాడీ గ్రోత్ టాబ్లెట్లు ఇస్తూ రకరకాల మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ ఫోటోలు తీసి కొంతమంది డైరెక్టర్లకు పంపిందట. ఇంతటితో ఆగకుండా కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని తన కూతురు వ్య*చారం చేయాలని టార్చర్ కూడా పెడుతుందట. కూతురు ఎదురు తిరగడంతో దాడికి కూడా దిగిందని ఈ టార్చర్ తట్టుకోలేక అమ్మాయి అర్ధరాత్రి 11 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించి కన్నీరు మున్నీరుగా తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading