Home » నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసా… సమంత… అదిరిపోయే రిప్లై ఇచ్చిన విజయ్..!

నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసా… సమంత… అదిరిపోయే రిప్లై ఇచ్చిన విజయ్..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఇప్పటికి కూడా ఈనటి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది.

Advertisement

సమంత ఆఖరుగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం అనే సినిమాలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి విజయ్ దేవరకొండ హీరోగా శివ నార్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 

Advertisement

ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఖుషి మూవీ షూటింగ్ టర్కీ లో జరుగుతుంది. టీ షెడ్యూల్లో సమంత తో పాటు విజయ్ కూడా పాల్గొంటున్నాడు.

అందులో భాగంగా వీరిద్దరూ కలిసి లాంచ్ కి వెళ్లారు. ఆ సమయంలో దిగిన ఒక ఫోటోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ … నిన్ను ఆకరణ ఉండటం చూసా… అలాగే మొదట ఉండడం చూశా… నీ ఉన్నత స్థితిని చూసా… అలాగే నీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా కొంతమంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు విజయ స్పందిస్తూ … నువ్వు నా ఫేవరెట్ లేడీ అంటూ స్పందించాడు. దీనితో వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహబంధం ఉందో అర్థం అవుతుంది.

Visitors Are Also Reading