Telugu News » Blog » అబద్ధం చెప్పిన నిహారిక.. పట్టుకున్న వరుణ్ తేజ్..!

అబద్ధం చెప్పిన నిహారిక.. పట్టుకున్న వరుణ్ తేజ్..!

by Manohar Reddy Mano
Ads

అన్న చెల్లి అనే రిలేషన్ ఎలా ఉంటుంది చాలా మందికి తెలుసు. ఎప్పుడు ప్రతి విషయంలో అన్నను ఇరికించడం.. చిన్న చిన్న గొడవలు అలాగే అల్లర్లు అనేవి బాగా ఉంటాయి. అయితే ఇవి కేవలం మాములు ప్రజల జీవితంలోనే కాకుండా సెలబ్రెటీల జీవితంలో కూడా అలానే జరుగుతుంది. అయితే మన తెలుగులోని ఇలా అన్న చెల్లి జోడిలలో వరుణ్ తేజ్ అలాగే నిహారిక ఉంటారు.

నటుడు నాగబాబు కూతురిగా మెగా ప్రిన్సెస్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారిక తన కంటూ గుర్తింపు అనేది తెచ్చుకుంది. కానీ పెద్ద పేరు అనేది సంపాదించలేదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరోగా వాసి ఇప్పుడు మెగా ప్రిన్స్ అయ్యాడు. అయితే ఇలా ప్రజలలో గుర్తింపు ఉన్న కూడా నిహారిక, వరుణ్ తేజ్ ల మధ్య ఆ ఫన్నీ గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా నిహారిక ఒక్క అబద్ధమా చెప్పగా.. వరుణ్ తేజ్ పట్టించేసాడు.

అయితే నిహారిక ఇప్పుడు పెళ్లి చేసుకొని సినిమాలకు కొంచెం దూరంగా ఉంటుంది. కానీ వెబ్ సిరీస్ లు అనేవి చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటూ వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇక తాజాగా ఓ ఫ్యాన్స్.. నువ్వు ఎప్పుడైనా తప్పు చేసి మీ అన్నను ఇరికించవా..? అని ప్రశ్నించగా నేను అలా ఎప్పుడు చేయలేదు అని పేర్కొంది. కానీ వరుణ్ తేజ్ వెంటనే.. ఆ జవాబు స్క్రీన్ షాట్ పెట్టి ‘అబ్బా’ అంటూ కామెంట్ చేసాడు. అంటే ప్రతి చెల్లిలాగా నిహారిక కూడా ఆ పని చేసింది వరుణ్ చెప్పకనే చెప్పేసాడు.

ఇవి కూడా చదవండి :

భారత్ కు షాక్.. కీలక పేసర్ కు గాయం..!

అందుకే ఐపీఎల్ ను అందరూ తప్పుబడుతున్నారా…?


You may also like