Home » షాకింగ్… డ్రంక్ అండ్ డైవ్ లో ప‌ట్టుబ‌డ్ట జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష ఇమాన్యుయేల్..!

షాకింగ్… డ్రంక్ అండ్ డైవ్ లో ప‌ట్టుబ‌డ్ట జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష ఇమాన్యుయేల్..!

by AJAY

పండ‌గ‌లు ప‌బ్బాలు వ‌చ్చాయంటే చాలు ఆ పండ‌గ వాతావ‌ర‌ణం అంతా టీవీ షోల‌లోనే క‌నిపిస్తూ ఉంటుంది. ఇక న్యూయ‌ర్ వ‌చ్చిందంటే టీవీ షోల‌లో క‌నిపించే సంద‌డే వేరు. మ‌రో ప‌ది రోజుల్లో న్యూయర్ సెల‌బ్రేష‌న్స్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈటీవీ జ‌బ‌ర్ద‌స్త్ షో కూడా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది. దానికోసం పెళ్లాం వ‌ద్దు పార్టీ ముద్దు అనే పేరుతో ఎపిసోడ్ ను న్యూయ‌ర్ స్పెష‌ల్ గా సిద్దం చేసింది. కాగా దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేయ‌గా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ ఎపిసోడ్ కు హీరో వ‌రుణ్ సందేశ్, వితిక షెరు స్పెషల్ గాస్ట్ లు గా హాజ‌ర‌య్యారు.

varsha emmanuel

varsha emmanuel

అంతేకాకుండా ఈ షోలో రామ్ గోపాల్ వ‌ర్మ కూడా సంద‌డి చేశారు. అదే విధంగా లాస్య ఆమె భ‌ర్త కూడా సంద‌డి చేశారు. ఇక ఈ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగానే థ‌ర్టీ ఫ‌స్ట్ ను ఎంజాయ్ చేసిన అనంతరం టీమ్ లీడ‌ర్లు డ్రంక్ డైవ్ లో ప‌ట్టుబ‌డ్డారు. ఆ టీమ్ లీడ‌ర్ల‌ను ప‌ట్టుకుంది కూడా మ‌రెవ‌రో కాదు. థ‌ర్డ్ ఇయ‌ర్స్ పృధ్వీరాజ్ టీమ్ లీడ‌ర్ల‌ను ప‌ట్టుకుని టెస్ట్ లు చేశారు. మొద‌ట రాం ప్ర‌సాద్ ను ప‌ట్టుకోగా ఆ త‌రవాత రాకెట్ రాఘ‌వ‌, అంతే కాకుండా వ‌ర్ష మ‌రియు ఇమాన్యుయేల్ కూడా దొరికిపోయారు.

also read : VIRAL VIDEO : త‌గ్గేదే లే అంటున్న విష్ణు ప్రియ‌…స‌మంత ఐట‌మ్ సాంగ్ తో ఇన్స్టాను షేక్ చేస్తున్న బ్యూటీ..!

ఇక దొరికిన త‌ర‌వ‌త టీమ్ లీడ‌ర్లు మ‌రియు స‌భ్యులు చెప్పిన స‌మాధానాలు న‌వ్వులు పూయించే విధంగా ఉన్నాయి. ఇక ప్రోమో చివ‌ర‌లో ఆర్జీవీ త‌న‌దైన పంచుల‌తో ఆక‌ట్టుకున్నారు. ఎలా ఉన్నారు అని వ‌ర్ష అడ‌గ్గా అస్స‌లు భాగోలేను దానిగురించి ఏం చేద్దామిప్పుడు అంటూ ఆన్స‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా బ్లాక్ డ్రెస్ లో హీరోలా ఉన్నార‌ని పొగ‌డ‌గా మ‌రీ అంత ఎద‌వలా క‌నిపిస్తున్నానా అంటూ మ‌రో పంచ్ వేశారు.

Visitors Are Also Reading