Home » ఇండ్రస్ట్రీలో వర్మ తీసిన చెత్త సినిమాలు మరెవ్వరూ తీయలేదు.. ఆర్జీవీ ఎదుటే శివాజీ షాకింగ్ కామెంట్స్

ఇండ్రస్ట్రీలో వర్మ తీసిన చెత్త సినిమాలు మరెవ్వరూ తీయలేదు.. ఆర్జీవీ ఎదుటే శివాజీ షాకింగ్ కామెంట్స్

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా రాంగోపాల్ వర్మ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ రాజా ‘రాంగోపాల్ వర్మ అంత చెత్త మూవీస్ ఎవరు తీసి ఉండరని’ వ్యాఖ్యానించాడు. అలాగే దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ప్రయాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో శివాజీ రాజా చేసిన ఈ కామెంట్స్ ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ కాంపౌండ్ హీరోయిన్ అయిన హాట్ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘తలకోన’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు.

Advertisement

అక్షర క్రియేషన్ పతాకంపై శ్రీమతి స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి చేవెళ్ల నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు శివాజీ రాజా, ప్రముఖ నిర్మాత రామారావు హాజరయ్యారు. వాళ్ల చేతుల మీదే గానే పాటలు, ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. తలకోన అడవిలో నేను కూడా కొన్ని సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నాను. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే చాలా కష్టంగా ఉంటుంది. వాటిని అధిగమించి షూటింగ్ పూర్తి చేశారు అంటేనే చిత్ర యూనిట్ సంకల్పం ఏంటో అర్థమవుతుంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

Advertisement

 

ఆ తర్వాత రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ..” మా ఎంట్రీ 1985లో జరిగింది. అప్పటివరకు ఇండస్ట్రీ అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. 1988లో ఓ సినిమా వచ్చింది. దాని పేరు శివ. అప్పుడు స్టార్ట్ అయింది అలజడి. రాము అనే ఒక పేరులోనే వైబ్రేషన్. ఆయన తీసిన సినిమాల్లో ‘క్షణ క్షణం’ నేను చూసినన్నిసార్లు ఆయన కూడా చూసి ఉండరు. ‘శివ’ రెండు మూడు సార్లు మాత్రమే చూశాను. ఇప్పటికీ ‘క్షణక్షణం’ నా ఫేవరెట్ సినిమా అని చెబుతూ ఉంటా. అంత ఇంప్రవైజేషన్ ఉన్న సినిమా మళ్లీ ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. అంత అందంగా శ్రీదేవి ఏ సినిమాలోనూ కనిపించలేదు” అని అన్నారు.

ఇది రాము గారికి సంబంధించిన సినిమా అయినా, అవ్వకపోయినా ఆయన కంటే సీనియర్ గా ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఇక ఆయన తీసిన కొన్ని అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ తీయలేదు. ఆయన తీసిన చెత్త సినిమాలు కూడా ఎవరు తీయలేదు. రెండు రికార్డ్స్ ఆయనకే ఉన్నాయి. కానీ ఆయన నుంచి నాలాంటి ఫ్యాన్స్ మంచి సినిమాలు ఎక్స్ పెక్ట్  చేస్తారు. కచ్చితంగా ఆయన నుంచి మంచి సినిమా వస్తుందని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Visitors Are Also Reading