Home » స‌మంత సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

స‌మంత సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర లో తెర‌కెక్కుతున్న తాజా సినిమా య‌శోద‌. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగం గా జ‌రుపుకుటుంది. అయితే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ను చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా మ‌ధుబాల అనే పాత్ర లో ప్ర‌ముఖ నటి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టిస్తుందని తెలిపారు. ఈ పాత్ర షూటింగ్ కూడా నేటి ప్రారంభం అయింద‌ని తెలిపారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నేటి షూటింగ్ లో పాల్గొంద‌ని తెలిపారు. కాగ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెరకెక్కుతున్నఈ సినిమా ను మార్చి వ‌ర‌కు పూర్తి చేయాల‌ని చిత్ర బృందం బావిస్తుంది.

Advertisement

Advertisement

ఈ నెల 23 వ‌ర‌కు ఈ సినిమా లో ప్ర‌ధాన పాత్రల షూటింగ్ ను పూర్తి చేయ‌నున్నారు. అలాగే వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 3 నుంచి ఈ సినిమా రెండో షెడ్య‌ల్ ప్రారంభం కానుంది. కాగ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14 గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. హరి – హరీష్ ఇద్దరు కొత్త ద‌ర్శ‌కులు ఈ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. య‌శోద సినిమా థ్రిల్లర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఆడియన్స్ ఆకట్టుకునే విధంగా సినిమా తెర‌కెక్కిస్తామ‌ని వెల్ల‌డించారు.

Visitors Are Also Reading