Home » మా నాన్నే.. నా విలన్..ఆ పనులు చేశాడు – వనిత విజయ్ కుమార్

మా నాన్నే.. నా విలన్..ఆ పనులు చేశాడు – వనిత విజయ్ కుమార్

by Bunty
Ad

ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె వనిత మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వనిత 1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చినటువంటి దేవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత ఇతర ఏ సినిమాల్లో కూడా వనిత కనిపించలేదు. వనిత సినిమాల్లో నటించినప్పటికీ తన తండ్రితో వివాదాలు, పెళ్లిళ్లు, బిగ్ బాస్ షో వంటి వాటితో నిత్యం గొడవలతో వార్తల్లో నిలుస్తూ ఉండేది.

Advertisement

ఇక చాలా సంవత్సరాల తర్వాత వనిత… నరేష్, పవిత్ర లోకేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నరేష్ మూడో భార్యగా నటించారు. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా…ఇంటర్వ్యూలో పాల్గొన్న వనిత తన తండ్రికి, తనకు మధ్య ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా ఏ అమ్మాయికైనా తన తండ్రి తన హీరో. కానీ మా నాన్న మాత్రం నాకు విలన్ అని చెప్పలేను.

Advertisement

కానీ ఆయన నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. ఆయనకు, నాకు ఆస్తి తగాదాలు ఉండడంతో ఆయన నన్ను పోలీసులకు పట్టించారు. పోలీసులను ఇంటికి రప్పించి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఆరోజు రాత్రి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక నడిరోడ్డుపై ఒంటరిగా ఉన్నాను. అప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల నా ఆస్తిని నేను దక్కించుకున్నాను. ఇప్పుడు దర్జాగా అక్కడే బతుకుతున్నాను అని వనిత ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

చైనా క్రికెట్ ఎందుకు ఆడదో తెలుసా..దీని వెనుక అంత పెద్ద రహాస్యం ఉందా ?

Visitors Are Also Reading