Home » వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్… గురించి తెలియని వారు ఉండరు. ఫిదా, గద్దల కొండ గణేష్, తొలిప్రేమ మరియు f3, F2 సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు వరుణ్ తేజ్. అదే సమయంలో… టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటితో కూడా లవ్ ఎఫైర్ నడిపించాడు వరుణ్ తేజ్. అయితే ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు వరుణ్ తేజ్. అయితే నిన్న రాత్రి లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది.

Advertisement

మెగా కుటుంబం, అల్లుకుటుంబ సభ్యుల సమక్షంలో… వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. మీరు ఎంగేజ్మెంట్ కు నాగబాబు ఇల్లే… అడ్రస్ గా మారిపోయింది. మెగా కుటుంబం మరియు అల్లు కుటుంబం సమక్షంలోనే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లు ఒకరినొకరు రింగులు మార్చుకున్నారు. అయితే ఈ వేడుకకు మెగా కుటుంబం మరియు అల్లు కుటుంబం తప్ప టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ హాజరు కాలేదు. అంటే చాలా సీక్రెట్ గా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చేశారు నాగబాబు.

Advertisement

 

అయితే ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠిలు తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈ తరుణంలోనే లావణ్య త్రిపాటి ఓ ఆసక్తి కర ట్వీట్ చేసింది. తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన లావణ్య త్రిపాఠి… 2016 నుంచి తాము ప్రేమలో ఉన్నామని లవ్ సింబల్ జత చేసింది. దీంతో వీరిద్దరూ 2016 నుంచే ప్రేమలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాగా వీరిద్దరూ అదే సమయంలో మిస్టర్ సినిమా చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కాగా అంతరిక్షం సినిమాలోని ఈ జంట కలిసి నటించింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

శుభమన్ గిల్ తో పెళ్లికి సారా గ్రీన్ సిగ్నల్?

స్క్రీన్‌ లోనే కాకుండా… నిజ జీవితంలోనూ పెళ్లి చేసుకున్న సెలబ్రీటీలు

Visitors Are Also Reading