కర్ణాటకకు మరో వందే భారత్ ట్రైన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే బెంగళూరు నుంచి మరో ప్రధాన నగరమైన హైదరాబాదుకు ఈ రైలు తీసుకురావాలని రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వందే భారత్ ప్రారంభించారు. ఎలాంటి డిమాండ్ వస్తుందో అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ లను నడిపేందుకు ఇండియన్ రైల్వే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వందే భారత రైలు బెంగళూరు మరియు హైదరాబాద్ సమీపంలోని కాచిగూడ మధ్య నడుస్తుందని దక్షిమధ్య రైల్వే శాఖ నోటిఫికేషన్లలో తెలియజేసింది.
Advertisement
also read:ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?
అయితే దేశంలోనే కర్ణాటక మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ మైసూరు- బెంగళూరు-చెన్నై మార్గంలో నడుస్తున్న విషయం తెలుసు. ఉత్తర కర్ణాటక వందే భరత్ ఎక్స్ప్రెస్ బెంగళూరు- హుబ్లి,దర్వాడు -బిలాగావి – ఉత్తర కర్ణాటకకు మధ్య త్వరలో ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య వందే భారత ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. దీనివల్ల కన్నడిగులకు మరింత సౌకర్యంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీని తర్వాత మరో స్మార్ట్ సిటీ అయిన బెంగళూరు నుంచి పూణే, ఆధ్యాత్మిక కేంద్రాలైనా తిరుపతికి కూడా ఈ ఎక్స్ప్రెస్ ను రానుందని సమాచారం.
Advertisement
గత సంవత్సరం వందే భారత్ ప్రాజెక్టును ప్రవేశపెట్టగా ప్రస్తుతానికి నాగపూర్ నుంచి బిలాస్పూర్, చెన్నై -మైసూరు- సికింద్రాబాద్, ఢిల్లీ -వారణాసి, గాంధీనగర్- ముంబై , వైజాగ్ తో సహా పలుమార్గాల్లో 8 వరకు రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు 75 రైలు, రాబోవు మూడేళ్లలో 400కు పైగా రైలును పట్టాలెక్కించాలని భారత రైల్వే శాఖ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్వర్క్ అప్డేట్ చేసే పనిలో దక్షిణ మధ్య రైల్వే నిమగ్నమైంది. ఈ మార్గాల్లో గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడవనుంది.
also read: