Home » నమ్రత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

నమ్రత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. నమ్రత మహేష్ భార్యనే కాదు.. మిస్ ఇండియాగా, హీరోయిన్ గా అందరికీ తెలిసిందే. తొలుత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ లోకి అడుగుపెట్టిన 1993లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయింది. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చి పలు హిందీ సినిమాలలో నటించి మెప్పించింది. 

Advertisement

 

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన వంశీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత. తాజాగా నమ్రత తన 51వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈమెకు 51 సంవత్సరాలున్నప్పటికీ ఇప్పటికీ మూడు పదుల వయస్సు కలిగిన అమ్మాయి మాదిరిగానే కనిపిస్తుంటుంది. నమ్ర జనవరి 22, 1972లో మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరంలో జన్మించింది. ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు.. నమ్రత నాన్నమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ నటి. 

Advertisement

Also Read :   ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Manam News

ఆమె 1938 బ్రహ్మచారి అనే సినిమాలో నటించారు. నాన్నమ్మ వారసత్వంలో శిల్పా, నమ్రతలు హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నమ్రత ఫ్యామిలీలో కేవలం ఆమె మాత్రమే కాకుండా.. అక్క, నాన్నమ్మ కూడా ప్రముఖ హీరోయిన్స్ గా కొనసాగారు. నమ్రత, మహేష్ బాబు వంశీ సినిమా సమయంలో ఒకరికొకరు ఇష్టపడడంతో పాటు ఆ తరువాత కొంతకాలం పాటు డేటింగ్ చేసి ఆ తరువాత  ఫిబ్రవరి 10, 2005 న ముంబైలోని ప్రముఖ హోటల్ లో పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత మహేష్ కెరీర్ టర్న్ తిరిగిందనే చెప్పాలి. అంతేకాదు.. ఇప్పటికీ మహేష్ బాబుకి సంబంధించిన కొన్ని పనులను నమ్రత  దగ్గర ఉండి చూసుకుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబుకి సంబంధించి, తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు నమ్రత. 

Also Read :   వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?

Visitors Are Also Reading