Home » వాల్తేర్ వేరయ్య vs వీర సింహ రెడ్డి ఈ రెండిటిలో నిర్మాతలకి లాభాలు తెచ్చే సినిమా ఏదంటే..?

వాల్తేర్ వేరయ్య vs వీర సింహ రెడ్డి ఈ రెండిటిలో నిర్మాతలకి లాభాలు తెచ్చే సినిమా ఏదంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

సంక్రాంతి వచ్చిందంటే పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలయ్యింది. బాలయ్య చిరంజీవి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటం ఇప్పటివరకు చాలాసార్లు జరిగింది. ఇక ఈ యేడాది కూడా చిరు బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు.

Advertisement

Also Read:   మోక్షాజ్ఞ లో ఈ మార్పు రావడానికి కారణం అదేనా…?

 

అయితే ఈసారి మాత్రం ఇద్దరు హీరోల సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. దాంతో ఇద్దరిలో ఎవరి సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ విషయంపై సీనియర్ సినీ జర్నలిస్ట్ భరద్వాజ ఆసక్తికర కామెంట్లు చేశారు.

Advertisement

వీర సింహారెడ్డి సినిమా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పారు. ఇటీవల కాలంలో బాలయ్య ఇమేజ్ పెరిగిందని… దాంతో బాలయ్య సినిమాలకు కలెక్షన్ లు భారీగా వస్తున్నాయని అన్నారు. అయితే వీర సింహారెడ్డి సినిమాకు మొదటి రెండు రోజులు కలెక్షన్ లు ఎక్కువగా వచ్చాయని… దాంతో ఆ సినిమాకు లాభాలు వచ్చాయని చెప్పారు.

అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉందని అన్నారు. ఆ సినిమా లాంగ్ రన్ లో నడుస్తుందని చెప్పారు. మొదటి రోజు కలెక్షన్ లు తక్కువగా వచ్చినా లాంగ్ రన్ వల్ల ఆ సినిమాలకు కూడా నష్టాలు రాకుండా లాభాలు వస్తున్నాయని చెప్పారు. దాంతో వాల్తేరు వీరయ్య సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిందని భరద్వాజ వెల్లడించారు.

Also Read:  చనిపోయే ముందు రోజే విలన్ రఘువరన్ కు అలాంటి అనుభవం…ఎవ్వరికీ తెలియని నిజం ఇదే…!

Visitors Are Also Reading