Home » మోక్షాజ్ఞ లో ఈ మార్పు రావడానికి కారణం అదేనా…?

మోక్షాజ్ఞ లో ఈ మార్పు రావడానికి కారణం అదేనా…?

by AJAY

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. కొంతకాలం మోక్షజ్ఞ అసలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.

కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని చెప్పాడు. అంతేకాకుండా మోక్షాజ్ఞ విదేశాల్లో నటనలో మెలకువలు తీసుకుంటున్నాడు అని కూడా గతంలో వార్తలు వినిపించాయి. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షాజ్ఞ సినిమా ఉంటుంది అని కూడా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఓ ఇంటర్వ్యూలో బాలయ్య తన కుమారుడితో మొదటి సినిమాను తెరకెక్కిస్తానని సైతం చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే గతంలో కెమెరాకు చిక్కని మోక్షాజ్ఞ కొంతకాలంగా తరచూ మీడియా ముందు కనిపిస్తున్నాడు. దాంతో సినిమాల్లోకి ఎంట్రీ కోసమే మోక్షాజ్ఞ ఈమధ్య జనాల్లో కనిపిస్తున్నాడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల వచ్చిన వీర సింహారెడ్డి సినిమాను మోక్షాజ్ఞ జీవీకే లో చూడగా దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా హిట్ 2 సినిమాను మోక్షాజ్ఞ ఫ్యామిలీతో కలిసి చూసాడు. ఆ ఫోటోలు కూడా చెక్కర్లు కొట్టాయి. ఇక రీసెంట్ గా సంక్రాంతి పండగకు నారావారిపల్లెలో మోక్షాజ్ఞ సందడి చేశాడు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading