Home » శ్రీరామనవమి రోజు పెట్టే ప్రసాదంలో అంతటి అద్భుత ఔషదం ఉందా ?

శ్రీరామనవమి రోజు పెట్టే ప్రసాదంలో అంతటి అద్భుత ఔషదం ఉందా ?

by Anji
Ad

సాధారణంగా భారతీయ సంస్కృతిలో ప్రతీ పండుగకి ఓ కారణం ఉంటుంది. పండుగ వేళలో దేవుడికి నైవేద్యంగా అర్పించే ప్రసాదానికి కూడా ఓ ప్రత్యేకమైన కారణముంటుంది. ప్రధానంగా ప్రసాదం అప్పటి కాలాన్ని బట్టి మానవులకు ఆరోగ్యం ప్రసాదించే విధంగా ఉంటుంది.  శ్రీరామనవమి రోజు స్వామి వారికి నైవేద్యంగా పానకం, వడపప్పు సమర్పిస్తారు.  

Also Read :  నాని ద‌స‌రా సినిమా ప్ల‌స్ లు మైన‌స్ లు ఇవే…సినిమాకు ఆ ఒక్క‌టే మైన‌స్ అయ్యిందట‌..?

Advertisement

శ్రీరామ నవమి రోజు పానకం, వడపప్పు ఎందుకు పెడతారో కారణాలను పరిశీలించినట్టయితే.. వేసవి కాలం ప్రారంభంలో శ్రీరామనవమి పండుగ వస్తుంది. అప్పటి నుంచి దాదాపు మూడు నెలల వరకు ఎండ విపరీతంగా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుకోవడానికి పానకం, వడపప్పు తరుచూ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం శ్రీరామ నవమి నుంచి ప్రారంభం కావాలన్నది దీని ఉద్దేశం. 

Also Read :  ఆ బిజినెస్ మాన్ తో కీర్తి సురేష్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన కీర్తి తల్లి..!!

Advertisement

Manam News

పానకం తయారీలో నీళ్లు, బెల్లం, యాలకలు, మిరియాలను ఉపయోగిస్తారు. పానకం శరీరంలోని వేడిని వెంటనే తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలు దాహాన్ని తగ్గించడమే కాదు.. శరీరంలోని కఫాన్ని కూడా తగ్గిస్తాయి. యాలకులు ప్రత్యేక ఔషద గుణాలను కలిగి ఉంటాయి. పెసరపప్పు కు కూడా వేడిని తగ్గించే గుణం ఉన్నందున పెసరపప్పుతో చేసే వడపప్పు ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు. పెసరపప్పులో ఉన్నటువంటి ఐరన్ రక్తహీనత తలెత్తకుండా కాపాడుతుంది. వడపప్పులో ఉపయోగించే పచ్చి కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు వైరల్, బాక్టిరియల్ ఇన్ ఫెక్షన్ ల నుంచి కాపాడుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే శ్రీరామనవమి రోజు వడపప్పు, పానకం ప్రసాదంగా తీసుకొని  వేసవికాలం వెళ్లిపోయేంత వరకు కూడా తరచూ తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. 

Also Read :  ఈ సీజన్ లో లభించే సపోటా పండ్లను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

Visitors Are Also Reading