Home » Varisu : ఏదిచ్చినా ట్రిపుల్‌గా తిరిగి ఇచ్చేస్తాడు.. ‘వారసుడు’ ట్రైలర్‌

Varisu : ఏదిచ్చినా ట్రిపుల్‌గా తిరిగి ఇచ్చేస్తాడు.. ‘వారసుడు’ ట్రైలర్‌

by Bunty
Ad

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది.

Advertisement

ఇది ఇలా ఉండగా, తాజాగా ఇప్పుడు వారసుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ చూస్తే ఏ కోశాన కూడా ఇది తమిళ సినిమా అన్నట్టుగా లేదు. పక్క రొటీన్ తెలుగు కమర్షియల్ సినిమాలానే ఉంది. ఓ ఇల్లు, ముగ్గురు కొడుకులు, వారికి పెద్ద వ్యాపారం. అందులో ఇద్దరు కొడుకులు (శ్యామ్, శ్రీకాంత్) వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక మూడో కొడుకు (విజయ్) కుటుంబానికి దూరంగా బయట ఉంటారు.

Advertisement

వ్యాపారం అన్నాక శత్రువులు ఉంటారు. ఇందులో prakash raj వారికి శత్రువు. తన ఫ్యామిలీకి కష్టాలు రావడంతో విజయ్ ఎంట్రీ ఇచ్చి శత్రువుల ఆట కట్టిస్తాడు. ఈ లైన్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క ఫ్రేమ్ డైలాగు కూడా కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే రావడం లేదు. మరి ఈ రొటీన్ తెలుగు సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. ఇక వారసుడు ట్రైలర్ లో డైలాగ్స్ ఐతే బాగున్నాయి.

Visitors Are Also Reading