Home » రష్యా పై అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఏమ‌న్నారంటే..?

రష్యా పై అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

ఉక్రెయిన్ ర‌ష్యా ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య చైనా త‌న వైఖ‌రిని తెలియ‌జేయాల‌ని శ్వేత సౌథం ప్రెస్ సెక్ర‌ట‌రీ జెన్ సాకి తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో ర‌ష్యాను క‌ట్ట‌డి చేసేందుకు స్విప్ట్ నుంచి ర‌ష్యాను బ‌య‌టికి పంపాల‌ని సూచ‌న‌ల‌పై అమెరికా స్పందించింది. స్విప్ట్‌పై ఆంక్ష‌లు అనే ఆప్ష‌న్ ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని వెల్ల‌డించింది. యూరోప్ అప్పుడే దీనిపై నిర్ణ‌యం తీసుకోదు అని అభిప్రాయ‌ప‌డింది. అమెరికా స్విప్ట్ నుంచి ర‌ష్యాను బ‌య‌ట‌కు పంపిస్తే ర‌ష్యా అంత‌ర్జాతీయ వాణిజ్యంలో స‌మ‌స్య‌లు త‌లెత్తి ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం ప‌డే ప్ర‌మాద‌ముంది.

Also Read :  శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం.. రోహిత్ స‌రికొత్త రికార్డు..!

Advertisement

ఉక్రెయిన్‌లోని సైన్యాన్ని పంప‌డాన్ని నిర‌సిస్తూ ర‌ష్యాలోని ప‌లు న‌గ‌రాల‌లో నిర‌స‌న‌లు చేప‌ట్టిన దాదాపు 1700 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ భార‌త విదేశాంగ మంత్రి జై శంక‌ర్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని ప‌రిస్థితులు వాటి ప‌రిణామాలపై ఇరు దేశాల నేత‌లు చ‌ర్చించారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌లు జ‌ర‌ప‌డంపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాఉ. పుతిన్‌ను ఆక్ర‌మ‌ణ‌దారుగా అభివ‌ర్ణించారు.

Advertisement


ముఖ్యంగా పుతిన్ యుద్ధాన్ని ఎంచుకున్నాడు అని, తదుప‌రి ప‌రిణామాల‌కు ర‌ష్యా బాధ్య‌త వ‌హించాల‌ని పేర్కొన్నారు పుతిన్‌. సోవియ‌ట్ యూనియ‌న్‌ను తిరిగి స్థాపించాల‌నుకుంటున్నార‌ని బైడెన్ వెల్ల‌డించారు. ఉక్రెయిన్ అంశంపై భార‌త్తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం అని వెల్ల‌డించారు. అమెరికాపై ర‌ష్యా ఏమైనా సైబ‌ర్ దాడులు జ‌రిపితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాటో దేశాల‌కు అమెరికా సైన్యాన్ని పంపించ‌నున్నాం. యూరోప్ దేశాల‌కు ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ర్య పుతిన్ సోవియేట్ యూనియ‌న్‌ను తిరిగి స్థాపించాల‌నుకుంటున్నారు. అంత‌ర్జాతీయ స‌మాజానికి పుతిన్ ఆలోచ‌న‌లు విరుద్ధంగా ఉన్నాయ‌ని.. అస‌లు పుతిన్‌తో మాట్లాడాల‌నే ఆలోచ‌నే లేద‌ని బైడెన్ వెల్ల‌డించారు.

Also Read :  థియేట‌ర్ల వ‌ద్ద ప‌వ‌న్ అభిమానులు నూత‌న నిర‌స‌న

Visitors Are Also Reading