స్త్రీలు కొంతమంది తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ లాంటివి ఉపయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం పొందినప్పటికీ, మరోసారి అలాగే రిపీట్ అవుతూ ఆ ఇబ్బందితో ఎక్కువ కాలం బాధపడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట గోరు వెచ్చని లేదా చల్లని నీళ్లలో నాలుగు స్పూన్ల తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. మళ్ళీ రెండు గంటల తరువాత ఆ నీటిని తాగాలి.
Advertisement
ఇలా ఒక రోజులో ఐదు లేదా ఆరు సార్లు హనీ,లెమన్ వాటర్ తాగే ప్రయత్నం చేయాలి. ఇలా తేనె నీళ్లు తాగిన గంట తర్వాత మంచి నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ తగ్గి యూరిన్ తెల్లగా వస్తుంది. ఇలా రోజుకు నాలుగు లేదా ఐదు లీటర్ల మంచినీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తేనె,నీళ్లు మంచి నీళ్ల తో పాటు కొబ్బరి నీళ్లు కూడా తాగితే మంచిది. ఇలా చేయడం ద్వారా ఉపవాసం చేసినప్పుడు లవణాలు బాగా అంది మీకు నీరసం రాకుండా ఉంటుంది.
Advertisement
ఇలా 5 నుండి 6 రోజులు తేనె, నిమ్మరసం, మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగితే యూరిన్ లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అయినా కూడా యూరిన్ లో ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఈ జ్యూస్ ఫాస్టింగ్ ని కంటిన్యూ చేయాలి. మూడు గంటలకు ఒకసారి ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు. చెరుకు రసం, వెజిటేబుల్ జ్యూస్, పండ్ల రసం, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా ఏ జ్యూస్ అయినా సరే రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు తాగితే వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్ తగ్గి, శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ALSO READ;
టీఎస్ లో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండిలా..!!
ఇంట్లో ఆడవారు 9 లవంగాలు, ఉప్పుతో ఇలా చేస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి..!!