రైతుబంధు సహాయనిధులు పూర్తిస్థాయిలో జమ కావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది ఇప్పటికే నిధుల విడుదల కి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మొత్తం 70 లక్షల మంది రైతులకు నిధుల్ని ఇవ్వాల్సి ఉందని చెప్పింది. తాజా లెక్కల ప్రకారం చూసినట్లయితే 30 లక్షల మంది రైతులకి అందినట్లు తెలుస్తోంది మిగిలిన వాళ్ళకి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంకొంచెం సమయం ఇస్తే తీసుకుని పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధుల గురించి చర్చ మొదలైంది ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం తర్వాత రద్దు చేయడం రాజకీయంగా చర్చకి కారణమైంది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుబంధు విడుదల చేస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటు అయింది. 9న రైతుబంధు పంపిణీ సీఎం అట్టహాసంగా మొదలుపెట్టారు.
జనవరి తొలి వారంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అవసరాల కోసం మధ్యలో రైతుబంధు నిధుల విడుదలకి బ్రేక్ ఇచ్చారు. తర్వాత తిరిగి అందుబాటులో ఉన్న నిధుల మేరకు విడుదల చేస్తున్నారు. రైతుబంధు కింద 70 లక్షల మంది రైతులకు 7600 కోట్ల జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు 30 లక్షలు మంది రైతులకు 1000 కోట్ల లోపే పెట్టుబడి సహాయం పంపిణీ చేసినట్లు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!