Telugu News » Blog » త్వరలో సుధీర్ రశ్మి జంటగా సినిమా..కానీ ఆ ఒక్కటి సుధీర్ కి నచ్చడం లేదట..!!

త్వరలో సుధీర్ రశ్మి జంటగా సినిమా..కానీ ఆ ఒక్కటి సుధీర్ కి నచ్చడం లేదట..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

టాలెంట్ ఉండాలే కానీ ఎక్కడికి వెళ్లినా ఏం చేసైనా బ్రతకవచ్చు. అపజయం వచ్చిందని,నిరాశ పడకుండా, రాబోయే విజయంపై గురిపెట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అలా ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ సాధించారు మెజీషియన్, కమెడియన్, యాంకర్,హీరో సుడిగాలి సుధీర్.. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, మరి ఎన్నో బాధలు, అన్నింటిని దాటుకొని తాను నమ్ముకున్న మెజీషియన్ వృత్తినే బేస్ చేసుకొని ఒక్కో మెట్టెక్కుతూ జబర్దస్త్ ద్వారా సూపర్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించారు సుదీర్.

Advertisement

also read;పునీత్ రాజకుమార్ సహా చిన్న‌వ‌య‌సులోనే క‌న్న‌ముసిన క‌న్న‌డ స్టార్ హీరోలు..! అదే శాపంగా మారిందా..?

ఇక జబర్దస్త్ లో తనదైన టైమింగ్ కామెడీతో స్టార్ కమెడియన్ గా మారారు. తాను కమెడియన్ గా ఎదగడమే కాకుండా ఎంతోమంది కమెడియన్లకు సుధీర్ జీవితాన్ని ఇచ్చారని చెప్పవచ్చు. అలాంటి సుధీర్ రష్మీ జంట అంటే అభిమానుల్లో అత్యంత క్రేజ్.. వీరిద్దరూ స్టేజిపై కనిపించారంటే ఇక ప్రతి ఒక్కరు టీవీల ముందు కూర్చోవాల్సిందే. సోషల్ మీడియాలో అయితే వీరి పెళ్లికూడా చేసేసారు.. అలాంటి సుదీర్ రష్మి జంటగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి సూపర్ జోడిగా పేరు సంపాదించుకున్నారు.. ఏది ఏమైనా అభిమానులకు కోరిక తీరలేదు.. అదేంటయ్యా అంటే సుధీర్ హీరో గా, రష్మీ హీరోయిన్ గా ఒక సినిమా రావాలి అనేదే అందరికీ ఉన్నటువంటి కోరిక.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అది తప్పనిసరిగా హిట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు..

Advertisement

అయితే వీరి కాంబోలో సినిమా రావడంపై తాజాగా సుధీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.. ఆయన ఏమన్నారంటే.. చాలా కథలు వింటున్నాం, మా ఇద్దరికీ సెట్ అయ్యే కథ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం.. అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరుతుందని అన్నారు.. ఇక తాజాగా విడుదలై సూపర్ హిట్ సాధించిన గాలోడు సినిమా సుధీర్ కు మరింత పేరు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా సుదీర్ రష్మి కాంబోలో వచ్చే సినిమా కూడా సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం..

Advertisement

also read;