Home » హైపర్ ఆది ఒక్క స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నటున్నాడో తెలుసా ? హీరోలకి పోటీగా !

హైపర్ ఆది ఒక్క స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నటున్నాడో తెలుసా ? హీరోలకి పోటీగా !

by AJAY
Ad

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులకు పరిచయమై ప్రస్తుతం సినిమాలతో టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గాలోడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ సుధీర్ సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లను రాబ‌డుతోంది.

Advertisement

అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకడు. ప్రస్తుతం హైపర్ ఆది టీవీ షో లతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. హైపర్ ఆది హీరోగా నటించినప్పటికీ హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ సైతం అందుకుంటున్నాడు. తాజాగా హైపర్ ఆది రెమ్యున‌రేష‌న్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఒక స్కిట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో హైపర్ ఆది మొదటిసారి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. హైపర్ ఆది మాట్లాడుతూ… ఒక స్కిట్ చేయాలంటే చాలా కష్టపడాలి. పంచ్ లు రాసుకోవాలి..డైలాగులు రాసుకోవాలి. రిహాల్సల్స్ చేయాలి. కాబట్టి ఒక స్కిట్ కు మేము ఇంత తీసుకుంటాము అంటూ రెండు చేతులతో వేళ్లు చూపించాడు.

అంటే హైపర్ ఆది ఒక స్కిట్ కి దాదాపు రెండు లక్షల వరకు తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం హైపర్ ఆది మాత్రమే కాకుండా చాలామంది టీం లీడర్లు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కంటెస్టెంట్లకు 1000 నుండి 10,000 వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading