Home » పునీత్ రాజకుమార్ సహా చిన్న‌వ‌య‌సులోనే క‌న్న‌ముసిన క‌న్న‌డ స్టార్ హీరోలు..! అదే శాపంగా మారిందా..?

పునీత్ రాజకుమార్ సహా చిన్న‌వ‌య‌సులోనే క‌న్న‌ముసిన క‌న్న‌డ స్టార్ హీరోలు..! అదే శాపంగా మారిందా..?

by AJAY
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాలీవుడ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ హ‌వా క‌నిపిస్తోంది. శాండల్ వుడ్ నుండి వచ్చిన కేజిఎఫ్ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో య‌ష్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా సైతం రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన కాంతారా సినిమాకు సైతం కలెక్షన్ల వర్షం కురిసింది.

Advertisement

అయితే అలాంటి కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన కొంతమంది హీరోలు మాత్రం చిన్న వయసులో సడన్ గా కన్నుమూయడం బాధాకరం. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగ‌తి తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ కంటే ముందు కూడా ఇద్దరు స్టార్ హీరోలు చిన్న వయసులోనే కన్నుమూశారు.

Advertisement

కన్నడ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన హీరోలలో హీరో విష్ణువర్ధన్ కూడా ఒకరు. కన్నడ మెగాస్టార్ గా విష్ణువర్ధన్ అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ చిత్రాలలో నటించి మెప్పించారు. కన్నడ చంద్రముఖి సినిమాలో విష్ణువర్ధన్ హీరోగా నటించి అలరించారు. కాగా విష్ణువర్ధన్ సైతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. 2009లో ఆయ‌న మ‌ర‌ణ‌వార్తవిని అభిమానులు షాక్ అయ్యారు.

అంతేకాకుండా 90 స్ శంకర్ నాగ్ అనే హీరో స్టార్ హీరోగా ఎదిగారు. పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో శంకర్ నాగ్ ప్రేక్షకులను అలరించారు. అయితే స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే కేవలం 35 ఏళ్ల వయసులో శంకర్ నాగ్ సైతం కన్నుమూశారు. శంకర్ నాగ్ మృతి చెందిన నాటికి ఆయన నటించిన పది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కన్నుమూయడం ఓ శాపంగా అక్కడి అభిమానులు భావిస్తున్నారు.

Visitors Are Also Reading