Home » రామ్ చరణ్ కంటే ఉపాసనే అధిక ధనవంతురాలా..? 

రామ్ చరణ్ కంటే ఉపాసనే అధిక ధనవంతురాలా..? 

by Anji
Ad

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. 2012 లో వీరి వివాహం జరగగా.. చాలా కాలం తరువాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబురాలు అంబురాన్ని అంటాయి. ఇదే సమయంలో రామ్ చరణ్-ఉపాసనకు సంబంధించి పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. రామ్ చరణ్ భార్య ఉపాసనకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకస్థానముంది. 

Advertisement

తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో అలరించడమే కాదు.. అపోలో ఆసుపత్రి పనులు చూసుకోవడంతో పాటు తన సొంత బిజినెస్ లలో బీజీగా ఉంటుంది ఉపాసన. చరణ్-ఉపాసన ఆస్తి విలువ రూ.2500 కోట్లు ఉందట. ఇక ఇందులో కేవలం ఉపాసన ఆస్తి రూ.1130 ఉన్నట్టు సమాచారం. బిజినస్ మ్యాన్ టైకూన్ సి ప్రతాపరెడ్డి మనవరాలు. ఆయన అపోలో ఆసుపత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన నికర ఆస్తుల విలువ రూ.21,000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో ఉన్నటువంటి టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరు. 

Advertisement

ప్రస్తుతం ప్రతాపరెడ్డి అపోలో ఆసుపత్రి మార్కెట్ విలువ రూ.70 వేల కోట్లుగా ఉంది. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఉపాసన ఫారెన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకుంది. చదువు పూర్తి అయిన వెంటనే బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. బి పాజిటివ్ అనే మ్యాగజైన్ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తుంది. ఇంత సంపాదన ఉన్న ఉపాసన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎక్కువగా బంధాలకు విలువనిస్తారు. అత్తమామలు చిరంజీవి, సురేఖ అంటే అమితమైన గౌరవం కనబరుస్తారు. మెగా అభిమానులు ఆమె ప్రవర్తను చాలా ఇష్టపడుతారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ప్రభాస్ ముందే మొత్తుకున్నా ఓం రౌత్ వినలేదా ? అంత కావాలనే చేసారా ? కొత్త అనుమానాలకు దారి తీస్తున్నా వివాదాలు !

 Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

కేసీఆర్ కు దిమ్మతిరిగేలా షాక్.. బీసీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపేనా ?

Visitors Are Also Reading