Home » ప్రభాస్ ముందే మొత్తుకున్నా ఓం రౌత్ వినలేదా ? అంత కావాలనే చేసారా ? కొత్త అనుమానాలకు దారి తీస్తున్నా వివాదాలు !

ప్రభాస్ ముందే మొత్తుకున్నా ఓం రౌత్ వినలేదా ? అంత కావాలనే చేసారా ? కొత్త అనుమానాలకు దారి తీస్తున్నా వివాదాలు !

by Srilakshmi Bharathi
Ad

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ ఆది పురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. జూన్ 16 న విడుదల అయిన ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఇప్పటికీ నెగటివ్ ట్రోలింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన చర్చలు ఏదో ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి. పాత్రల చిత్రీకరణ, సంభాషణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

omrouth 1

Advertisement

ఇది ఇలా ఉంటె.. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే ప్రభాస్ కు డౌట్ వచ్చిందట. ఈ సినిమాకు నేను సూట్ అవుతానా? ఈ సినిమాను నేను చేయవచ్చా అని ప్రభాస్ ఓం రౌత్ ను ముందుగానే అడిగారట. షూటింగ్ పూర్తి అయిన నాలుగు రోజులకే నేను పోషిస్తున్న రాఘవుడి పాత్రపై అనుమానం వచ్చిందని ప్రభాస్ పేర్కొన్నారు. ఈ విషయాన్నీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ సందర్భంలో ప్రభాస్ చెప్పారు. ఈ వీడియో ను ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Advertisement

అయితే.. ఓం రౌత్ దగ్గర కూడా హెచ్చరికగా ప్రభాస్ సందేహం వెలిబుచ్చారట. కానీ, ఓం రౌత్ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, నేనున్నానని చెప్పడంతో ప్రభాస్ ఇక ఆ విషయాన్నీ వదిలేసారట. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభాస్ ముందే హెచ్చరించినా, ఓం రౌత్ నిర్లక్ష్యం చేసారని, రామాయణాన్ని సరిగా స్టడీ చేయకుండా ఇష్టానికి సినిమా తీసి జనాలమీదకి వదిలేశారని పేర్కొన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీయడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ భార్య గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

రామ్ చరణ్ కూతురి జాతకం చెప్పిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి! మొదటి సారి పాజిటివ్ గా!

సుధాకర్ కొడుక్కి అండగా చిరంజీవి.. స్నేహితుడి కోసమే..!

Visitors Are Also Reading