Home » ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేసిన ఉపాసన… ఆ అపోహలకు చెక్ పెట్టిందిగా!

ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేసిన ఉపాసన… ఆ అపోహలకు చెక్ పెట్టిందిగా!

by Bunty
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్, చిరుత సినిమాతో రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. చిరంజీవి తనయుడు కావడంతో అభిమానులు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిరుత సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాతో వచ్చే రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా, రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబడుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అచ్చం నయనతార లాగే, ఉపాసన కూడా చేస్తుందని.. అందుకే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌ లేదంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే, తాజాగా ఈ వార్తలకు ఉపాసన చెక్ పెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన దంపతులు థాయిలాండ్ లో జరుగుతున్న ఫ్యామిలీ పార్టీలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తుంది. దీంతో సరోగసి ద్వారా బిడ్డను కనబడుతున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. కాగా, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ ప్రాజెక్టు అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో మూవీ చేయనున్నారు.

READ ALSO : RRR నుంచి HIT 2 : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!

Visitors Are Also Reading