మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మనాన్నలుగా మారునున్న విషయం తెలిసిందే. అయితే 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పది సంవత్సరాల తరువాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీ పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Also Read : కొంతమంది జీవితం నుండి వెళ్లిపోయినా వారి ప్రభావం ఉంటుంది..రేణూదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!
Advertisement
ముఖ్యంగా లేట్ ప్రెగ్నెన్సీకి కారణం ఏంటో వివరించింది. ప్రధానంగా లేట్ ప్రెగ్నెన్సీ కారణంగా తనకు ఎలాంటి ఒత్తిడి ఎదురు అయిందో అందరితో షేర్ చేసుకుంది. “సమాజం కోరినప్పుడు కాకుండా నేను అమ్మను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చినందుకు ఉత్సాహంగా, గర్వంగా ఉంది. వివాహం జరిగి పదేళ్ల తరువాత మేము బిడ్డలను కనాలనుకున్నాం. ఎందుకు అంటే ఇది సరైన సమయం అనిపించింది. రామ్ చరణ్ నేను మారంగాలలో ఎదిగాం.
Advertisement
Also Read : నందమూరి కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే !
ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఇది మా ఇద్దరి నిర్ణయం. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి తలొగ్గలేదు” అని చెప్పుకొచ్చింది ఉపాసన. ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకు ఉన్నటువంటి స్పష్టతకు నిదర్శనం అన్నారు మెగా కోడలు ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వినగానే అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మెగా వారసుడు లేదా వారసురాలు పుట్టినప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ ఏవిధంగా ఉంటాయో వేచి చూడాలి మరి.
Also Read : కొంతమంది జీవితం నుండి వెళ్లిపోయినా వారి ప్రభావం ఉంటుంది..రేణూదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!