Home » Upasana: మరోసారి గొప్ప పని చేస్తున్న ఉపాసన.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు!

Upasana: మరోసారి గొప్ప పని చేస్తున్న ఉపాసన.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మెగా జంట రామ్ చరణ్ మరియు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ జంటకు ప్రేమకి ప్రతిరూపంగా కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వివాహమైన 11 ఏళ్ల తర్వాత పుట్టిన కూతురు క్లీంకార తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన గొప్ప మనసు గురించి అభిమానులందరికి తెలిసినదే. ఆమె ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అపోలో బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఉపాసన తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

Ramcharan and upasana

Advertisement

ఈ నిర్ణయంతో ఆమె మరో సారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. తల్లి కావడం అనేది ఏ మహిళకి అయినా ఒక ఎమోషనల్ జర్నీ. ఈ జర్నీ లో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, అనుభూతులను పొందుతూ ఉంటారు. అయితే.. తల్లి గా ఉండే ఇబ్బందులు ఒకెత్తు అయితే.. సింగల్ మదర్స్ ఇబ్బందులు మరొక ఎత్తు ఉంటాయి. ఈ క్రమంలోనే.. ఉపాసన ఓ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఇటీవల అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని ప్రారంభించిన ఉపాసన తమ హాస్పిటల్ లో ప్రతి ఆదివారం సింగల్ మదర్స్ తమ పిల్లలకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ విషయమై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. ఇక ఫాన్స్ ఆనందం చెప్పాల్సిన పని లేదు. ఉపాసన గురించి అందరికి తెలిసిందే కావడంతో ఆమె తీసుకున్న తాజా నిర్ణయానికి ఆమె ఫాన్స్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా తమ హర్షాన్ని కామెంట్స్ లలో వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

 ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

Visitors Are Also Reading