Home » BANGARRAJU : బంగార్రాజులో ఉట్టికొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా….?

BANGARRAJU : బంగార్రాజులో ఉట్టికొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా….?

by AJAY
Ad

నాగార్జున నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ బంగార్రాజు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు. అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా… బంగార్రాజు సినిమాలో నాగచైతన్య కూడా నటించారు.

ALSO READ : టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరో ఎవరు…? ఎవరి మధ్య ఎక్కువ పోటీ ఉంది..?

Advertisement

ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య కు జోడిగా కృతి శెట్టి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో కృతితో పాటు పలువురు ముద్దుగుమ్మలు మెరిసిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభంలో ఒక అమ్మాయితో ఉట్టి కొట్టించడం కనిపిస్తుంది అదే అమ్మాయి మళ్ళీ లడ్డు ఉందా అనే పాట లోనూ కనిపిస్తుంది.

Advertisement

ఆ అమ్మాయి అందాన్ని చూసి ఎవరా అని ప్రేక్షకులు వెతకడం ప్రారంభించారు. ఆ అమ్మాయి ఎవరు…. ఏం చేస్తుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉట్టి కొట్టిన అమ్మాయి పేరు యష్ణ చౌదరి…. కాగా అమ్మాయి పక్కా హైదరాబాది ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి రేడియో మిర్చి లో ఆర్జే గా పనిచేసింది.

ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే బంగార్రాజు లో అవకాశం దక్కించుకుంది. ఇక నాగ చైతన్యతో సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని కానీ నాగార్జున తో నటించలేకపోవడం బాధగా ఉందని చెప్పింది. సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునతో కాసేపు సరదాగా మాట్లాడాలని యష్ణ చౌదరి పేర్కొంది.

Visitors Are Also Reading