సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసి ఒకసారి గెలిస్తే మళ్లీ అక్కడ నుండే పోటీ చేస్తే గెలవడం చాలా కష్టం. ఎంతో అభివృద్ధి చేస్తే తప్ప గెలవడం సులభం కాదు. అంతే కాకుండా ఎంత అభివృద్ధి చేసినా ఓ రెండు సార్లు గెలిస్తే ఆ తరవాత ఇక చాలని ప్రజలు కొత్తదనం కోరుకుంటారు. కానీ ఓ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబం ముప్పై ఏళ్లుగా గెలుస్తూ వస్తోంది. ఒకే కుటుంబం లోని సభ్యులు అక్కడ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. అవతల వైపు పోటీగా ఎవరు నిలుచున్నా సరే….గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే…వివరాల్లోకి వెళితే…. యూపీలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే అక్కడ రాయ్ బరేలి నియోజకవర్గం లో ముప్పై ఏళ్లుగా ఓకే కుటుంబం విజయ కేతనం ఎగరవేస్తు వస్తోంది. 1993, 1996,2002 లో అక్కడ కాంగ్రెస్ తరపున….2007 లో ఇండిపెండెంట్ గా మరియు 2012 లో పీస్ పార్టీ నుండి అఖిలేష్ సింగ్ విజయం సాధించారు. ఇక ఆయన కూతురు అదితి 2017 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచారు. అంతే కాకుండా అదితి 2021 లో బీజీపీ లో చేరారు…..ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ ఒక్కసారి కూడా ఈ నియోజవర్గం నుండి గెలవలేదు.