Home » Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ప్రోమో చూశారా..?

Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ప్రోమో చూశారా..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. మొట్టమొదటిసారి పవన్ ఒక టాక్ షోకు రావడం అది నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి రావడం పెను సంచలనాన్నే సృష్టించింది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా ముగించుకున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా.. అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆహా మేకర్స్ పోస్టర్స్ తో ప్రోమోతో అభిమానులు అంచనాలను ఆకాశానికి ఎత్తేలా చేసేసారు.

Advertisement

తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది. పవన్ గ్రాండ్ ఎంట్రీ, బాలయ్య సరదా మాటలు, పవన్ సోల్ ఫుల్ నవ్వు.. అభిమానుల కళ్ళలో ఆనందం వెరసి ప్రోమో మొత్తం కన్నుల పండుగగా కనిపించింది. ప్రభాస్ ఎపిసోడ్ లానే పవన్ ఎపిసోడ్ ను కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలయ్య సరదాగా మొదలుపెట్టిన ప్రశ్నలు చివరికి సీరియస్ గా మారిన విధానం కనిపించింది. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వర అంటూ బండ్ల గణేష్ ను ఇమిటేట్ చేస్తూ బాలయ్య మాట్లాడిన తీరు నవ్వులు పూయిస్తుంది. ఇక గుడుంబా శంకర్ లో ట్ మీద ప్యాంట్ వేయడం దగ్గర నుంచి ప్రశ్నల వర్షం కురిపించాడు బాలయ్య.

Advertisement

ఇక త్రివిక్రమ్ తో స్నేహం, అన్న చిరుతో అనుబంధం, మూడు పెళ్లిళ్లు, రాజకీయాలు ఇలా సీరియస్ టాపిక్స్ తో పాటు పవన్ చిన్నతనాన్ని కూడా బాలయ్య వెలికి తీశాడు. ఇక మధ్యలో రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఫిట్టింగ్ మాస్టర్ అని బాలయ్య సంబోధించడం నిజంగా ఆశ్చర్యాన్ని రేకెత్తించే విషయమే. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎంట్రీ తో మరిన్ని నవ్వులు పూసాయి. మాయ మూడ్ను చేతులు కట్టుకొని ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడో చెప్పడం, దానికి పవన్ కౌంటర్ వేయడం ఆకట్టుకుంది. తేజ్ సైతం తొడకొట్టు అని బాలయ్య అనగానే డైరెక్ట్ గా వెళ్లి బాలయ్య తొడ మీద కొట్టడం అభిమానుల ముఖం మీద నవ్వులు తెప్పించింది. ఇక చివరిలో పవన్ మూడు పెళ్లిళ్ల విషయం ఎత్తి షో మొత్తం హీట్ ఎక్కించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read :  జమున కొడుక్కు ఏమైంది.. కనీసం తల్లి తలకొరివి పెట్టలేదు ఎందుకో..?

Visitors Are Also Reading