Home » జమున కొడుక్కు ఏమైంది.. కనీసం తల్లి తలకొరివి పెట్టలేదు ఎందుకో..?

జమున కొడుక్కు ఏమైంది.. కనీసం తల్లి తలకొరివి పెట్టలేదు ఎందుకో..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో జమున ఎంతటి గుర్తింపు సాధించిందో మనందరికీ తెలుసు. అప్పటి స్టార్ హీరోలైనా ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి హీరోలందరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతటి మహానటి 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది. దాదాపు 198 సినిమాల్లో నటించిన జమున ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె వయోభారం వల్ల శుక్రవారం హైదరాబాద్ లోని తన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచింది.

Advertisement

ఇక అభిమానుల సందర్శనార్థం ఆమె పార్టీవ దేహాన్ని ఫిలిం చాంబర్ కు తరలించారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంతక్రియలు చేశారు. కానీ ఇక్కడ ఒక అనుకోని ఘటన చోటుచేసుకుంది. వెండితెర సత్యభామగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు జమున. తన సినిమా కెరియర్ లో మొత్తం 198 చిత్రాల్లో నటించారు. ఇల్లరికం, లేత మనసులు, మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి గొప్ప చిత్రాల్లో నటించిన జమునకు బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం శ్రీకృష్ణతులాభారం. ఈ మూవీలో సత్యభామగా నటించిన జమునకు మంచి గుర్తింపు లభించింది.

Advertisement

అలాంటి జమున సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఈ తరుణంలో వయో భారం మీద పడడంతో శుక్రవారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అయితే జమునకు ఇద్దరు సంతానం. కొడుకు పేరు వంశీ జూలూరి, కూతురు పేరు స్రవంతి రావు. అయితే జమున అంత్యక్రియల్లో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తల్లిదండ్రులు మరణిస్తే కొడుకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ జమునకు కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. దీనికి ప్రధాన కారణం జమున కొడుకు విదేశాల్లో ఉండడం. ఆయనకు అర్జెంటుగా రావడానికి వీలుపడకపోవడంతో కుమార్తె స్రవంతి రావు అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించింది.

also read:

Visitors Are Also Reading