నటన అనేది వారసత్వంగా కూడా వస్తుంది అనడానికి జూనియర్ ఎన్టీఆర్ నిదర్శనం. తన తాత ఎన్టీ రామారావు రూపురేఖలతో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ నటనలోనూ తాత వారసత్వాన్ని అందుకున్నారు.
Jr.Ntr Unseen images and Pics
సినిమా కుటుంబం నుండే వచ్చినా హీరోగా నిలదొక్కుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. కెరీర్ ప్రారంభం లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవాడు. దాంతో ఆయన పై ట్రోల్స్ కూడా వచ్చేవి..కానీ ఎన్టీఆర్ మాత్రం నటన, డ్యాన్స్ తో ఆ ట్రోల్స్ కు చెక్ పెట్టాడు.
స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమై సూపర్ హిట్ ను అందుకున్నారు. ఎన్టీ రామారావు మనవడు తాతకు తగ్గ మనవడు అని అందరి చేత అనిపించుకున్నాడు.
Jr.Ntr Unseen Pics
సింహాద్రి సినిమా తో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక యమదొంగ సినిమా టైమ్ లో రాజమౌళి చెప్పడం తో ఎంతో కష్టపడి సన్నబడ్డాడు.
Jr.Ntr Unseen Pics
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తన కెరియర్ లో వెనక్కి చూసుకోలేదు. ఎన్టీఆర్ కు నందమూరి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Jr.Ntr Unseen Pics
నందమూరి ఫ్యామిలీ లో మూడో తరం నటవారసత్వాన్ని కొనసాగించే హీరో వచ్చేశాడు అంటూ మురిసిపోయారు. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఉన్నారు.
Jr.Ntr Unseen Pics
కానీ నటన కు ప్రాధాన్యత ఉన్న సినిమా చేయాలంటే మాత్రం ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. జై లవకుశ సినిమా లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో నటించి ఆశ్చర్యపరిచాడు.
ఈ సినిమాలో ట్రిబుల్ యాక్షన్ తో ఎన్టీఆర్ మెప్పించాడు. ఇక అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి.
బ్రహ్మానందం తో పోటీ పడి ఎన్టీఆర్ కామెడీ చేశాడు. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి.
రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తరవాత ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
Jr.Ntr Unseen Pics
ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సంద్భంగా మీరిప్పుడూ చూడని ఫోటోలు మీ ముందుకు తీసుకువచ్చాం. ఒక లుక్ వేయండి.
Also read :
విడాకుల తరావత రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఇవేనట…!