టాలీవుడ్ దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలను తీసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన కుమారుడిగా అల్లరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నరేష్. ఫస్ట్ మూవీతోనే సూపర్ సక్సెస్ సాధించాడు. దీంతో అప్పటి నుంచి నరేష్ పేరు కాస్త అల్లరి నరేష్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత వరుస కామెడీ సినిమాలతో నటించి కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకొని చాలా సీరియస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇట్లు మారెడుమిల్లి ప్రజానికం తరువాత ఉగ్రం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
Advertisement
ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. మే 5న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నరేష్ పలు ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు 60 సినిమాల్లో నటించినట్టు తెలిపారు.
Advertisement
Also Read : Dasari…. చిరు, బాలయ్య, నాగార్జునలకు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చట!
ఒకానొక సమయంలో తన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదని.. ఆ సమయంలో తనను చాలా మంది ఎన్నో విమర్శలు చేశారు. కొందరూ సినిమాలకు దూరమవ్వడం మంచిది అంటూ కామెంట్ చేశారని గుర్తు చేసుకున్నారు నరేష్. తాను మాత్రం సినిమాలకు దూరమవ్వడం అనేది జరగదని.. చనిపోతే తప్ప సినిమాలకు దూరం కాను అంటూ తన సినీ కెరీర్ గురించి ప్రస్తావించారు. అల్లరి నరేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నరేష్ నటించిన ఉగ్రం మూవీ సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మే 05 వరకు వేచి చూడాల్సిందే.