Home » అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?

by Anji
Ad

ఉద‌య్ కిర‌ణ్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసి ఉంటుంది. అతి కొద్ది కాలంలో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుని తిరిగిరాని లోకాల‌కు వెళ్లాడు. ఈయ‌న అప్ప‌ట్లో యువ‌త‌కు ఇత‌డు ల‌వ‌ర్ బాయ్, చాక్లెట్ భాయ్ అంటుంటారు.

Advertisement

ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించి ఇప్ప‌టికీ ఎవ‌రికీ తోచిన విధంగా వారు చెబుతుంటున్నారు. ఇక ఎవ‌రు ఎన్ని కార‌ణాలు చెప్పిన‌ప్ప‌టికీ వాస్త‌వం ఏంట‌నేది మాత్రం ఉద‌య్‌కిర‌ణ్ కి మాత్ర‌మే తెలుసు.

ఇది కూడా చ‌ద‌వండి :  అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు.. ఆ శాప‌మే కార‌ణ‌మా..?

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి మొద‌లు నేటి వ‌ర‌కు కూడా త‌న‌పై వంద‌లాది ఆర్టిక‌ల్స్‌ పుట్టుకొచ్చాయి. సోష‌ల్ మీడియాలో సైతం ఎవ్వ‌రికీ న‌చ్చిన‌ట్టు వారు రాస్తూనే ఉన్నారు. త‌న‌తో ప‌ని చేసిన తోటి న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు కూడా త‌మ‌కు తోచిన విష‌యాల‌ను త‌మ‌కు తెలిసిన విష‌యాల‌ను మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ముర‌ళిమోహ‌న్ ఉద‌య్ కిర‌ణ్‌కి సంబంధించిన ఓ విష‌యాన్ని చెప్పుకొచ్చాడు. ముర‌ళీ మోహ‌న్ చెప్పిన ప్ర‌కారం.. ఉద‌య్ కిర‌ణ్‌ని తొలుత హీరోగా చేయాల‌ని ముర‌ళీ మోహ‌న్ భావించాడ‌ట‌. ఆ విష‌యం ఉద‌య్ కిర‌ణ్‌తో ప్ర‌స్తావించ‌గా.. అత‌డు సినిమా చేయ‌డానికి త‌న సిద్ధ‌మంటూ మాట ఇచ్చాడ‌ట ఉద‌య్ కిర‌ణ్‌.

Advertisement


ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయడానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. ఈ లోపు ఉద‌య్ కిర‌ణ్ చిరంజీవి కుమార్తె సుష్మితతో వివాహం నిశ్చ‌య‌మైంది. ఉద‌య్ కిర‌ణ్‌కి సంబందించిన అన్ని వ్య‌వ‌హారాలు అర‌వింద్ ద‌గ్గ‌ర ఉండి చూసుకున్నాడ‌ని చివ‌రికీ అత‌డు డేట్స్ కి సంబంధించిన డైరీ ని కూడా అర‌వింద్ ద‌గ్గ‌రే పెట్టుకున్నాడ‌ని ఎవ‌రికీ ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎవ‌రితో సినిమా చేయాలి ఎన్ని డేట్స్ ఇవ్వాల‌ని అర‌వింద్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగేవ‌ని ముర‌ళీమోహ‌న్ తెలిపారు. అంత‌కు ముందే అత‌డు సినిమా ఒప్పుకున్నాడు కాబ‌ట్టి ముర‌ళీమోహ‌న్ వెళ్లి ఉద‌య్ కిర‌ణ్ డేట్స్ అడ‌గ్గా ఖాళీ లేవ‌ని అర‌వింద్ చెప్ప‌డంతో ఉద‌య్ కిర‌ణ్ ఏమీ చేయ‌లేక‌పోయాడ‌ని చెప్పుకొచ్చాడ‌. దీంతో అత‌డు సినిమా ఉద‌య్ నుంచి మ‌హేష్ బాబుకి వెళ్లింద‌ని సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టాడు ముర‌ళీమోహ‌న్‌. ఉద‌య్ కిర‌ణ్ పెళ్లి క్యాన్స‌ల్ కావ‌డం.. అదే స‌మ‌యంలో అత‌నికి వ‌చ్చిన అవ‌కాశాలు చేజారిపోవ‌డం.. ఆ త‌రువాత ఉద‌య్ కెరీర్ డౌన్ అయింది. ఇక ఆ త‌రువాత ఆయ‌న మ‌ర‌ణించారు.

ఇది కూడా చ‌ద‌వండి  : అల్లు అర్జున్ మొదటి సినిమా “గంగోత్రి” హీరోయిన్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? అస్సలు గుర్తు పట్టలేరు గా !

Visitors Are Also Reading