Home » కాంతార హీరో రిష‌బ్ శెట్టి భార్య ఎవ‌రో తెలుసా.? ఆయ‌న ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా.?

కాంతార హీరో రిష‌బ్ శెట్టి భార్య ఎవ‌రో తెలుసా.? ఆయ‌న ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా.?

by AJAY
Ad

క‌న్న‌డ సినిమా కాంతార బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. సాండిల్ వుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ రీమేక్ చేయ‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేట‌ర్ ల‌లో ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. కేవ‌లం 16 కోట్ల‌తో ఈ సినిమాను నిర్మించ‌గా వంద‌కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఇక ఈ సినిమాలో రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. రిష‌బ్ శెట్టి కాంతార సినిమాలో హీరోగా న‌టించడంతో పాటూ స్వ‌యంగా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు.

Advertisement

అంతే కాకుండా క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన కిరిక్ పార్టీ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది రిష‌బ్ షెట్టినే….ఇలా రిష‌బ్ శెట్టి హీరోగా మారియు టాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కాంతార సినిమా హిట్ త‌ర‌వాత తెలుగు ప్రేక్ష‌కులు రిషబ్ శెట్టి ప‌ర్స‌న‌ల్ జీవితం కూడా తెలుసుకోవడాని ఆస‌క్తిచూపిస్తున్నారు.

Advertisement

రిషబ్ శెట్టికి ఇప్ప‌టికే పెళ్లి జ‌రిగిపోయింది. రిష‌బ్ శెట్టి ప్ర‌గ‌తి శెట్టి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2016లో ఓ సినిమా ఈవెంట్ లో రిష‌బ్ శెట్టి ప్ర‌గ‌తిశెట్టిని మొద‌టిసారి చూశార‌ట‌. అంతే కాకుండా మొద‌టి చూపులోనే ప్ర‌గ‌తితో రిషబ్ ప్రేమ‌లో ప‌డిపోయారు. ఆ త‌ర‌వాత ఆమె కోసం ఫేస్ బుక్ లో వెతుకుతుంటే ప్ర‌గతి శెట్టే రిష‌బ్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది.

అది చూసి ఆనందంలో రిష‌బ్ వెంట‌నే యాక్సెప్ట్ చేశాడు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింది. కానీ రిష‌బ్ శెట్టిని అల్లుడిగా చేసుకునేందుకు ప్ర‌గ‌తి శెట్టి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేద‌ట‌. కానీ ప్ర‌గ‌తి ప‌ట్టుప‌ట్టి అత‌డినే పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర‌వాత వీరికి ఓ కుమారుడు జ‌న్మించాడు. వీరిద్ద‌రూ అన్యోన్యంగా ఉంటూ చాలా జంట‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Visitors Are Also Reading