అన్నగారు ఎన్టీరామారావు సినీరాజకీయ జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అవి చాలా వరకు భయటకు రాలేదు. ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకున్న లక్ష్మి పార్వతి గురించి ఆ పెళ్లి తరవాత జరిగిన సంఘటనల గురించి కూడా చాలా వరకు భయటకు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లకు సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియవు. ఎన్టీఆర్ కు హిందూ ధర్మం అన్నా ఆచారాలు సంప్రదాయాలు, తెలుగు భాష అన్నా ఎంతో గౌరవం ఉండేది.
Advertisement
ఆ కారణం వల్లనే భాషా ప్రావీణ్యం ఉన్న లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు లక్ష్మీ పార్వతికి ఉన్న జ్ఞానం వల్లనే ఎన్టీఆర్ మోసపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు తెలుగు భాష అంటే ఎంతఇష్టమో చెప్పేందుకు ఒక చక్కటి ఉదాహరణ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…ఎన్టీఆర్ తన కూతుళ్లకు పెట్టిన పేర్లు చూస్తే చాలా ఆయన భాషా జ్ఞానం భాష పై ఉన్న ప్రేమ మనకు అర్థమైపోతాయి.
Advertisement
ఎన్టీఆర్ కు ఏడుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే అందరి పేర్లకు కూడా చివరన ప్రాస కుదిరేలా ఎన్టీఆర్ నామకరణం చేయడం విశేషం. ఏడుగురు కొడుకుల పేర్ల చివరణ కృష్ణ అనే పదం ఉంటుంది. రామకృష్ణ, సాయికృష్ణ, జయ కృష్ణ, బాల కృష్ణ, హరికృష్ణ అని ఇలా పెట్టారు. ఇక కూతుళ్ల విషయానికి వస్తే నలుగురు కూతుళ్ల పేర్ల చివరణ కూడా ఈశ్వరి అనే పేరు వచ్చేలా నామకరణం చేశారు.
Also Read: ఓవైపు నరేష్-పవిత్ర బందం.. మరోవైపు రమ్య వైరం.. వీరి మధ్యలో ట్విస్ట్‌లు ఏమిటంటే..?
లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని పెట్టారు. రెండో తరంలోనూ ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుమిదిని అని పెట్టారు. రెండవ కుమారుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని, మనశ్విని అని పెట్టారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్విణి గా పెట్టారు. చిన్న కుమారుడు సాయకృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాణి అని అన్నగారే పెట్టారట. ఇక ఈ పేర్లు వింటేనే ఎన్టీఆర్ కళాత్మక హృదయం అర్థం చేసుకోవచ్చు.
Also Read: అప్పుడే మొదలయ్యింది..! చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలోని ఈ లుక్ అక్కడ కాపీ చేశారా? అంటూ ట్రోల్స్…!