Telugu News » Blog » ఓవైపు న‌రేష్-ప‌విత్ర బందం.. మ‌రోవైపు ర‌మ్య వైరం.. వీరి మ‌ధ్య‌లో ట్విస్ట్‌లు ఏమిటంటే..?

ఓవైపు న‌రేష్-ప‌విత్ర బందం.. మ‌రోవైపు ర‌మ్య వైరం.. వీరి మ‌ధ్య‌లో ట్విస్ట్‌లు ఏమిటంటే..?

by Anji

న‌రేష్ ప‌విత్ర లోకేష్ టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో ఈ రెండు పేర్లు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. గ‌త కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న‌ట్టు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసిన వీరి గురించే చ‌ర్చించుకోవ‌గం విశేషం. ముఖ్యంగా న‌రేష్ పై అత‌ని భార్య‌.. ప‌విత్ర‌పై ఆమె భ‌ర్త మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ త‌రుణంలో ఓసారి ఏమి జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads


న‌రేష్-ప‌విత్ర వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల్లో జంట‌గా న‌టించారు. నాలుగేళ్ల కాలం నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని, వివాహం చేసుకోబోతున్నార‌ని కొద్ది రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రొక వైపు న‌రేష్‌-ప‌విత్రలు క‌లిసి ప్రైవేట్ ఈవెంట్ల‌తో పాటు గుడి, గోపురాల్లో క‌నిపించ‌డంతో ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్కుబోతున్నార‌నే ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. దీనిపై న‌రేష్ మీడియా ముందుకొచ్చి సినిమా వాళ్ల పెళ్లిళ్లు బ‌య‌టికి క‌నిపిస్తాయి. మిగ‌తా వాళ్ల‌వి అస‌లు క‌నిపించ‌వు. పెళ్లి అనేది ఆట‌కాదు.. అది ఒక జీవితం. రాను రాను మ్యారేజ్ వ్య‌వ‌స్థ ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక న‌టుడికి స్థిర‌త్వం ఉండ‌దు. స‌మ‌యానికి ఇంటికి రారు.నేను నెల‌లో 28 రోజులు షూటింగ్‌లోనే ఉంటాను. ఇప్ప‌టికీ నా మొద‌టి భార్య సినిమానే నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునే వారితోనే క‌లిసి జీవించ‌గ‌ల‌ను అని న‌రేష్ పేర్కొన్నారు.


ఈ త‌రుణంలోనే న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి న‌రేష్‌-ప‌విత్రల వ్య‌వ‌హారంపై స్పందించారు. న‌రేష్‌తో నాకు స‌త్సంబంధాలు లేవు. నాకు ఇప్ప‌టివ‌ర‌కు విడాకులు ఇవ్వ‌లేదు. నాకు విడాకులు ఇవ్వ‌కుండా ఆయ‌న మ‌రొక పెళ్లి ఎలా చేసుకుంటాడు. నేను ఇప్ప‌టికీ ఇంకా న‌రేష్ భార్య‌నే. ఒక వేళ ఆయ‌న‌కు మ్యారేజ్ అయితే నా ప‌రిస్థితి ఏమిటి..? దాదాపు మూడేళ్ల నుంచి మా మ‌ధ్య విభేదాలున్నాయి. న్యాయ ప‌రంగా విడాకులు తీసుకోవ‌డం అనేది చాలా పెద్ద ప్ర‌క్రియ‌. అందుకు చాలా స‌మ‌యం పడుతుంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో న‌రేష్ నాపై కేసు పెట్టారు. అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు నోటీసులు రాకుండా గేట్ ద‌గ్గ‌ర నుంచే పంపారు. జూన్‌లో పోస్టు మాస్టర్ నా నెంబ‌ర్ కు కాల్ చేసి చాలా స‌మ‌న్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని చెప్పారు.

Ads


న‌రేష్ మూడ‌వ భార్య ర‌మ్య చేసిన ఆరోప‌ణ‌ల‌ను న‌రేష్ ఖండించారు. రూ.50ల‌క్ష‌ల కోసం మా ఇంట్లో వారిని పీడ్చింది. ఆమెకు విడాకుల నోటిసు పంపి నెల రోజులు దాటింద‌ని.. విడాకుల నోటీసు పంపిన త‌రువాత నాకు పెళ్లి కాబోతుంద‌ని రూమ‌ర్స్ క్రియేట్ చేసింది. ఈ వివాదంలోకి పవిత్ర‌ను ప్ర‌స్తావిస్తూ రూమ‌ర్స్ క్రియేట్ చేయ‌డం చాలా త‌ప్పు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో నేను ఎంతో మంది హీరోయిన్స్‌తో క‌లిసి ప‌ని చేశాను. ఎవ‌రితో కూడా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని.. ముఖ్యంగా ర‌మ్య‌ర‌ఘుప‌తి నా జీవితాన్ని నాశ‌నం చేశార‌ని పేర్కొన్నారు. ర‌మ్య ఆరోప‌ణ‌ల‌పై ప‌విత్ర లోకేష్ కూడా స్పందించారు. ర‌మ్య హైద‌రాబాద్ నుంచి బెంగళూరు వ‌చ్చి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి త‌న‌పై అసత్య ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు అన్నారు.

ఏదైనా స‌రే వారి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లోనే తేల్చుకోవాలి. కానీ త‌నను బ్యాడ్ చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌రేష్ చాలా మంచి వ్య‌క్తి ఆయ‌న‌కు నాకు మ‌ధ్య ఎలాంటి దాప‌రికాలు లేవు. కేవ‌లం నేమ్‌, ఫేమ్ కోసం ర‌మ్య మీడియా ముందుకు వ‌స్తున్నారు. న‌రేష్‌కు మీ స‌పోర్ట్ కావాల‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో స‌డ‌న్ ఎంట్రీ ఇచ్చిన ప‌విత్రా లోకేశ్ భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ ర‌మ్య చేసిన ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ స్పందించారు. ప‌విత్ర కాపురాలు కూల్చ‌డం అల‌వాటు అని, అందుక‌నే త‌న‌ను వ‌దిలేసి వెళ్లిపోయిన‌ట్టు చెప్పారు. ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : 

త‌న మూడ‌వ భార్యకు సంబంధించిన సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టిన న‌రేష్‌..!

చంద్రబాబు పై పోటీ విషయం లో క్లారిటీ ఇచ్చిన విశాల్…!