Home » అప్పుడే మొదలయ్యింది..! చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలోని ఈ లుక్ అక్కడ కాపీ చేశారా? అంటూ ట్రోల్స్…!

అప్పుడే మొదలయ్యింది..! చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలోని ఈ లుక్ అక్కడ కాపీ చేశారా? అంటూ ట్రోల్స్…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి చివరగా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇద్దరు స్టార్ హీరోలు ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. మెగాస్టార్ కెరీర్ లోనే ఈ సినిమా ఘోరమైన పరాజయం పాలైంది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పటికే మెగాస్టార్ గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ అనే సినిమాకు రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో గాడ్ ఫాదర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

god father1

Advertisement

ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఒక పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పాట కోసం సల్మాన్ ఖాన్ కూడా రంగంలోకి దిగారు. ఈ పాటలో చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

అయితే ఈ పోస్టర్ అచ్చం ఎన్టీఆర్ హీరోగా నటించిన లవకుశ సినిమాలోని రావణ్ పాటలోని సన్నివేశం మాదిరిగా కనిపిస్తుంది. రావణ్ పాటలో గొడుగులు పట్టుకుని ఒక సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం మాదిరిగానే గాడ్ ఫాదర్ పోస్టర్ లుక్ కూడా ఉండటం తో ఆ సినిమా తో లింక్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి లేపేసారా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Visitors Are Also Reading