టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. నందమూరి ఫ్యామిలీ తరవాత టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి కూడా అంతటి గుర్తింపు ఉంది. ఏఎన్ఆర్ నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక్కడే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో నాగార్జున గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్ స్టార్ హీరోగా నిర్మాతగా ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గానూ రాణిస్తున్నాడు. కానీ అక్కినేని నాగేశ్వరరావుకు మరో కుమారుడు కూడా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:చిరంజీవి విక్టరీ వెంకటేష్ మధ్య ఒక కామెడీ సన్నివేశం.. ఏ సినిమాలో తెలుసా..?
Advertisement
అంతే కాకుండా మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్లు ఎవరో ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అక్కినేని దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు వెంకట్ కాగా ఆ తవరాత కుమారుడు మనందరికీ తెలిసిన హీరో అందగాడు నాగార్జున.
Advertisement
ఇవి కూడా చదవండి: యాంకర్ సుమ రాజీవ్ లకు ఆ ఇల్లే శాపంగా మారిందా..? అందుకే అలా జరిగిందా..?
నాగార్జున గురించి చాలా మందికి తెలుసు కానీ ఆయన సోదరుడు వెంకట్ గురించి అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన ఒకప్పుడు నిర్మాతగా రాణించారు. అంతే కాకుండా అక్కినేని స్టూడియోస్ నిర్మాణంలో వెంకట్ కీలకంగా వ్యవహరించారు. అక్కినేని స్టూడియోస్ మేనేజర్ గా పనిచేసి నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు.
ఇక ఏఎన్ఆర్ అన్నపూర్ణమ్మల కుమార్తెల విషయానికి వస్తే పెద్ద కుమార్తె యార్లగడ్డ సురేంద్రను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే హీరో సుమంత్. అంతే కాకుండా ఏఎన్ఆర్ మరో కుమార్తె పేరు నాగసుశీల కాగా ఆమె అచ్యుత రంగారావును వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే సుషాంత్ కాగా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఏఎన్ఆర్ మరో కుమార్తె అక్కినేని సరోజ చాలా కాలం క్రితం కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎవరు..? రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు..!