Home » కృష్ణంరాజు మొద‌టి భార్య ఎవ‌రు..? రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు..!

కృష్ణంరాజు మొద‌టి భార్య ఎవ‌రు..? రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు..!

by Anji
Ad

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రెబ‌ల్‌స్టార్ గా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కృష్ణం రాజు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయారు. సెప్టెంబ‌ర్ 11న తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే.

Advertisement

కృష్ణంరాజు సినీ ప్ర‌స్థానంలో న‌టుడిగా, విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా హీరోగా న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. 1966లో విడుద‌లైన చిల‌కా గోరింకా సినిమా సినీ ఇండ‌స్ట్రీకి పరిచ‌యమ‌య్యారు కృష్ణంరాజు. దాదాపు 187 చిత్రాల్లో న‌టించారు. చివ‌రగా ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రంలో న‌టించారు. కృష్ణంరాజు వ్య‌క్తి జీవితం గురించి మాత్రం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. కృష్ణంరాజుకు శ్యామ‌ల‌దేవి కంటే ముందే సీతాదేవితో పెళ్లి జ‌రిగింది. కోట సంస్థానాధీశు వంశ‌స్తులు రాజా క‌లిదిండి ప్ర‌సాద వ‌ర‌హా వెంక‌ట సూర్య‌నారాయ‌ణ కుమార‌ల‌క్ష్మీ కాంత రాజ బ‌హుద్దూర్, స‌ర‌స్వ‌తీ దేవిల కుమార్తె సీతాదేవిని కృష్ణంరాజు 1969లో వివాహం చేసుకున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖ‌రీదైన బ‌హుమ‌తి ఏంటో తెలుసా..?

సీతాదేవి 1995లో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందింది. కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయార‌ట‌. ఆయ‌న మాన‌సిక ప‌రిస్థితి గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు రెండో పెళ్లి ఒత్తిడి తీసుకొచ్చారు. 1996లో తూర్పు గోదావ‌రి జిల్లా తునికి చెందిన శ్యామ‌ల‌దేవితో కృష్ణంరాజుకు రెండో పెళ్లి చేశారు. వీరికి ప్ర‌సీది, ప్ర‌కీర్తి, ప్ర‌దీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొద‌టి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు ద‌గ్గ‌రే ఉంటుంది. మ‌రో అమ్మాయిని కూడా కృష్ణంరాజు ద‌త్త‌త తీసుకున్నాడు. కృష్ణంరాజు-శ్యామ‌ల దేవి ఐదుగురు ఆడ‌పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులుగా ఉంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  కృష్ణంరాజు గ‌వ‌ర్న‌ర్ కాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading