Telugu News » Blog » చిరంజీవి విక్టరీ వెంకటేష్ మధ్య ఒక కామెడీ సన్నివేశం.. ఏ సినిమాలో తెలుసా..?

చిరంజీవి విక్టరీ వెంకటేష్ మధ్య ఒక కామెడీ సన్నివేశం.. ఏ సినిమాలో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆరు పదుల వయసులో కూడా చాలా బిజీ హీరోగా కొనసాగుతున్నారు. అయితే చిరు తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

 

also read:ర‌మ్య‌కృష్ణ ఓ న‌టుడికి చెల్లిగా, కూతురిగా, భార్య‌గా న‌టించింది.. ఆ న‌టుడు ఎవ‌రో తెలుసా..?

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తుండగా, ఇందులో కథానాయికగా శృతి హాసన్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో ఒక కీలకమైన పాత్రలో రవితేజ కూడా నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న దీనిపై ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అదేంటి అంటే ఆయన ఒక అతిథి పాత్ర పోషించనున్నారు అని సమాచారం. ఇందులో చిరంజీవికి మరియు వెంకీకీ ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ సన్నివేశంలో ఆయన నటించనున్నారని తెలుస్తోంది.

Advertisement

దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో ఉందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అని అంటున్నారు. ఈ చిన్న వార్త బయటకు రావడంతో ఓ వైపు మెగా అభిమానులు మరో వైపు దగ్గుబాటి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే దీనిపై రకరకాల కామెడీ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. వెంకటేష్ చిరంజీవితో కామెడీ అంటే మామూలుగా ఉండదు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Advertisement

also read:కేజీఎఫ్ లాంటి సినిమాలో చిరంజీవి 36 ఏళ్ల క్రితమే న‌టించాడు…ఆ సినిమా ఏదంటే..?

You may also like