Telugu News » Blog » ‘బద్రి’ స్టోరీని డైరెక్టర్ పూరి అంత చీప్ రేట్ కి అమ్మేయాలని అనుకున్నారా..? నాగ్ నుంచి పవన్ కి ఆ సినిమా ఎలా వెళ్లిందంటే…!

‘బద్రి’ స్టోరీని డైరెక్టర్ పూరి అంత చీప్ రేట్ కి అమ్మేయాలని అనుకున్నారా..? నాగ్ నుంచి పవన్ కి ఆ సినిమా ఎలా వెళ్లిందంటే…!

by AJAY
Published: Last Updated on
Ads

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ కూడా ఒకటి. పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ కృష్ణ వంశీ ల వద్ద శిష్యరికం చేశాడు. ఇక ప్రస్తుతం గురువులను మించిన శిష్యుడు అనిపించుకుంటున్నాడు. పూరీ ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూరి బద్రి సినిమా తో టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయం అయ్యాడు.

Advertisement

pawan kalyan Badri Movie - Manamnews

pawan kalyan Badri Movie – Manamnews

కానీ ఈ సినిమా కంటే ముందు పూరీ జగన్నాథ్ అనుకున్న ప్రాజెక్ట్ లు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. మొదట గా పూరి జగన్నాథ్ దర్శకుడు గా సుమన్ హీరోగా కాంబినేషన్ సెట్ అయ్యింది. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరవాత సూపర్ కృష్ణ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తిల్లానా అనే సినిమా అనుకున్నారు. ఈ సినిమా ఒకరోజు షూటింగ్ కూడా జరిపారు.

Advertisement

కానీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా తరవాత పూరి జగన్నాథ్ బద్రి సినిమా కథను రాసుకున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సినిమా కు కూడా మందు కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. ఈ కథ ను రాడుకున్నప్పుడు పూరీ జగన్నాథ్ నాగార్జునను హీరోగా అనుకున్నారట. అంతే కాకుండా ఈ సినిమా కథ ను అమలకు వినిపించాడట.

అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం తో పూరీ లైట్ తీసుకున్నారట. అదే సమయం లో ఓ నవలా రచయిత పూరి చెప్పిన బద్రి కాన్సెప్ట్ విన్నారు. బద్రి కాన్సెప్ట్ తో ఒక నవల రాసి ఇస్తే 10 వేల రూపాయలు ఇస్తా అని ఆఫర్ ఇచ్చాడట. దానికి పూరి జగన్నాత్ టెంప్ట్ కూడా అయ్యారు. సగం నవల రాసేసరికి బోర్ కొట్టి పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత అదే కథను పవన్ కళ్యాణ్ కు చెప్పి ఒప్పించాడు. అలా బద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also read :

Advertisement

సౌందర్య చనిపోయిన తరవాత అంత జరిగిందా…? ఆమె ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు అలా చేశారా…!